adding challans to electricity bills | ట్రాఫిక్ జరిమానాలు చెల్లించకపోతే.. విద్యుత్ బిల్లులకు కలపండి: సుప్రీంకోర్టు
adding challans to electricity bills | దేశ వ్యాప్తంగా పేరుకుపోతున్న ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన చలాన్లపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాఫిక్ జరిమానాలను చెల్లించని పక్షంలో విద్యుత్ బిల్లులకు చలాన్ల మొత్తం జతచేయాలని సూచించింది. అలాగే జరిమానాలు వసూలు చేసేందుకు ఇతర మార్గాలను కూడా అధికారులు పరిశీలించాలని పేర్కొంది.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పేరుకుపోతున్న ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన చలాన్లపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాఫిక్ జరిమానాలను చెల్లించని పక్షంలో విద్యుత్ బిల్లులకు చలాన్ల మొత్తం జతచేయాలని సూచించింది. (adding challans to electricity bills) అలాగే జరిమానాలు వసూలు చేసేందుకు ఇతర మార్గాలను కూడా అధికారులు పరిశీలించాలని పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సుమారు రూ. 45,000 కోట్ల విలువైన ఈ-చలాన్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు సుమారు రూ. 25,000 కోట్లు వసూలు అయ్యాయి.
కాగా, ఇంకా సుమారు రూ.20,000 కోట్లకు పైగా ఈ-చలాన్ బకాయిలు పెండింగ్లో ఉండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చలాన్ల మొత్తాన్ని వసూలు చేయడానికి అధికారులు క్షేత్రస్థాయిలో కచ్చితమైన చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. చలాన్ల కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జేబీ పార్దీవాలా కీలక సూచనలు చేశారు. ‘ప్రజలు ట్రాఫిక్ చలాన్లు చెల్లించకపోతే, ఆ మొత్తాన్ని వారి విద్యుత్ బకాయిల బిల్లుకు జతచేయండి. వారు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిందే, లేకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొనండి. ఈ దేశంలో ఏదో ఒక మార్గాన్ని మీరు వెతకాల్సిందే’ అని అన్నారు.
అలాగే చలాన్లు పెండింగ్లో ఉండే వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల పునరుద్ధరణ నిలిపివేయడం వంటి చర్యలను పరిశీలించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ వాహనాల యాజమాన్య బదిలీని నిరోధించడం, చలాన్లు క్లియర్ అయ్యేంత వరకు వాహన ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేయకపోవడం, అలాంటి వాహనాలను పరివాహన్ పోర్టల్లో బ్లాక్లిస్ట్ చేయడం, డ్రైవింగ్ లైసెన్సుల పునరుద్ధరణను నిలిపివేయడం వంటి అంశాలను కూడా పరిగణించాలని సూచించింది.
మరోవైపు ఇప్పటికే జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేయడం, చెల్లించని చలాన్లు ఉన్న వాహనాలకు పీయూసీ సర్టిఫికేట్లు జారీ చేయడానికి నిరాకరించడం వంటి ఇతర చర్యలను కూడా సుప్రీంకోర్టు చర్చించింది. వాహనాలను యాదృచ్ఛికంగా తనిఖీ చేయాలని, చెల్లించని ఈ-చలాన్ ఉన్నట్లయితే, అవసరమైతే అధికారులు దానిని స్వాధీనం చేసుకోవచ్చని కూడా కోర్టు పేర్కొంది.
దేశంలో ఈ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే, క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగణనలోకి తీసుకునే పరిష్కారాలను అధికారులు అన్వేషించాలని జస్టిస్ పర్దివాలా అన్నారు. అయితే చెల్లించని ట్రాఫిక్ చలాన్లను విద్యుత్ బిల్లులకు కలపాలన్న ఆలోచన కేవలం ఒక సూచన మాత్రమేనని, అమలు చేయడానికి ఆదేశం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

