చెన్నై: వేగంగా వెళ్తున్న బస్సులోంచి ఒక వృద్ధురాలు పడిపోయింది. రోడ్డుపై పడటంతో తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. ఆ బస్సులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Woman Falls From Speeding Bus) తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కోవైపుదూరు సమీపంలోని అరివోలి నగర్‌కు చెందిన 66 ఏళ్ల కామాక్షి ఆదివారం ఉదయం అయ్యప్పాల్ కోవిల్ బస్టాప్ వద్ద ఎస్-17 నంబర్ బస్సు ఎక్కింది.
కాగా, బస్సు వెనుక ద్వారం నుంచి ఎక్కిన ఆ వృద్ధురాలు ముందు ఉన్న ఖాళీ సీటు వద్దకు నడిచి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలో బస్సు డ్రైవర్ వేగాన్ని పెంచాడు. అదుపు తప్పిన కామాక్షి డోర్ లేని బస్సు ముందు ద్వారం నుంచి రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్ర గాయమైన ఆ వృద్ధురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు వృద్ధురాలి కుమార్తె ఫిర్యాదు ఆధారంగా బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బస్సులోని సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
📍Coimbatore, Tamil Nadu: A 66-year-old woman, G. Kamatchi, lost her life after falling from a moving private bus (Route S-17) at Kovaipudur on March 29. She reportedly lost balance while walking inside the bus and fell through the front stairs. pic.twitter.com/xilPHFBCaD
— Deadly Kalesh (@Deadlykalesh) April 3, 2026
Also Read:
Students Face Breathing Issues | విష వాయువులు పీల్చడంతో.. 26 మంది విద్యార్థులకు అస్వస్థత
Builder Steps On Wife’s Neck | భార్య మెడను కాలుతో తొక్కి.. దారుణంగా హత్య చేసిన బిల్డర్
5 Indians injured in Abu Dhabi | క్షిపణి శకలాలు పడి.. అబుదాబిలో ఐదుగురు భారతీయులకు గాయాలు
Watch: బురఖా ధరించిన మహిళ.. గన్‌తో బెదిరించి జ్యుయలరీ షాపులో దోపిడీ