అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబిలో మరో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. క్షిపణి శకలాలు పటడంతో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురు భారత పౌరులు కాగా, మిగతా వారు నేపాల్ జాతీయులు. (5 Indians injured in Abu Dhabi) శుక్రవారం అబుదాబిలోని గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ దాడి చేసింది. ఆ క్షిపణులను ఎయిర్ఢిఫెన్స్తో అడ్డుకున్నట్లు యూఏఈ అధికారులు తెలిపారు. అజ్బాన్ ప్రాంతంలో క్షిపణి శకలాలు పడినట్లు పేర్కొన్నారు.
కాగా, క్షిపణి శకలాలు పడటంతో 12 మంది వ్యక్తులు గాయపడినట్లు అబుదాబి మీడియా కార్యాలయం తెలిపింది. ఐదుగురు భారతీయులు, ఆరుగురు నేపాల్ జాతీయులు స్వల్పంగా గాయపడినట్లు పేర్కొంది. మరో నేపాల్ జాతీయుడు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అబుదాబి మీడియా వెల్లడించింది.
మరోవైపు మార్చి 26న అబుదాబిలోని స్వీహాన్ ప్రాంతంలో క్షిపణి శకలాలు పడ్డాయి. ఈ సంఘటనలో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు. మరణించిన ఇద్దరిలో ఒక భారతీయ పౌరుడు ఉన్నాడు.
Also Read:
Iran Oil Cargo | భారత్ రావాల్సిన చమురు నౌక చైనాకు.. దారి మార్చుకున్న ఇరాన్ నౌక.. కారణం ఇదేనా..?
US Intelligence: మిస్సైల్ లాంచర్లు, డ్రోన్లు సగమే ధ్వంసం అయ్యాయి.. ఇరాన్‌పై సంచలన రిపోర్టు
Pam Bondi: పామ్ బాండీ ఔట్.. అటార్నీ జనరల్‌పై వేటేసిన ట్రంప్