న్యూఢిల్లీ: ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై అటాక్ చేసిన విషయం తెలిసిందే. 35 రోజుల నుంచి సాగుతున్న సమరంలో ఇరాన్‌పై ఆయుధాలను అమెరికా దళాలు నిర్వీర్యం చేశాయి. లాంచర్లు, డ్రోన్లతో పాటు అనేక ఆయుధ సామాగ్రిని అమెరికా ధ్వంసం చేసింది. కానీ తాజాగా అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్(US Intelligence) విభాగంగా ఓ సంచలన రిపోర్టును రిలీజ్ చేసింది. ఇరాన్‌కు చెందిన ఆయుధ సంపదలో సగం కూడా ధ్వంసం కాలేదని ఆ నివేదికలో వెల్లడించింది. అమెరికా ఇంటెలిజెన్స్‌కు చెందిన నివేదికను సీఎన్ఎన్ వార్తా సంస్థ ప్రచురించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా ఇరాన్ ఆయుధ డిపోలను టార్గెట్ చేసినా.. ఇరానీ మిస్సైల్ లాంచర్లు, కమికేజ్ డ్రోన్లలో సగం ఆయుధ సామాగ్రి ఇంకా సుస్థిరంగానే ఉన్నట్లు ఓ రిపోర్టులో వెల్లడైంది.
ఇరాన్ వద్ద ఇంకా భారీ సంఖ్యలో మిస్సైల్ నిల్వలు ఉన్నట్లు తేలింది. ఈ రహస్య సమాచారాన్ని మూడు విభాగాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇరాన్ వద్ద ఇంకా ఆయుధ నిల్వలు భారీగానే ఉన్నా.. శిథిలాల కింద ఉన్న వాటిని ప్రస్తుతం వాడే స్థాయిలో లేనట్లు తెలిసింది. ఇరాన్ తీరం వెంట షార్ట్ రేంజ్ క్రూయిజ్ మిస్సైళ్లు ఉన్నట్లు భావిస్తున్నారు. చిన్న చిన్న నౌకలతో పాటు సర్ఫేస్ డ్రోన్లు కూడా కొన్ని వందల సంఖ్యలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. హోర్ముజ్ జలసంధిలో వాటిని మోహరించినట్లు పేర్కొన్నారు.
తాజాగా నిర్వహించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్‌కు చెందిన మారీటైం ఆస్తులను అమెరికా ఇంకా టార్గెట్ చేయలేదని తెలిసింది. ఇజ్రాయల్, గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తున్న లాంగ్ రేంజ్ సిస్టమ్స్‌ను మాత్రమే ఇప్పటి వరకు టార్గెట్ చేశారు. ఇరాన్ కు చెందిన లాంచ్ కెపాసిటీ 70 శాతం నిర్వీర్యమైనట్లు తెలిసింది. బాలిస్టిక్ మిస్సైల్ లాంచర్లు ఇంకా చాలానే ఇరాన్ వద్ద ఉన్నట్లు మిలిటరీ రిపోర్టులో పేర్కొన్నారు. ఇరాన్ వద్ద ఉన్న 470 బాలిస్టిక్ క్షిపణి లాంచర్లలో 60 శాతం ఆయుధాలను ధ్వంసం చేసినట్లు ఇటీవల ఇజ్రాయెల్ పేర్కొన్నది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాల మధ్య ఉన్న తేడా కొంత అయోమయాన్ని సృష్టిస్తున్నది.