ఖానాపూర్, జూలై 31: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణంపై ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం ఖానాపూర్లోని బీఆర్ఎస్ క్యాం పు కార్యాలయంలో ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన రాజకీయ జీవితంలో చేసిన ప్రజాసేవలను కొనియాడుతూ స్మరించుకున్నారు. అనంతరం ఆయన కు టుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నా యకులు గౌరికర్ రాజు, పుప్పాల గజేందర్, కారింగుల సుమన్, కేహెచ్ ఖాన్, గాజుల అజయ్, అడేపు రవి, రాజేశ్, ప్రణీత్, దాసు, చుక్కల నరేశ్ పాల్గొన్నారు.