అమరావతి : ఏపీలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ( Local body elections ) అధికార కూటమి నాయకులు వైసీపీ అభ్యర్థులను బెదిరించే అవకాశముందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy ) అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులను, అధికారులను ఉపయోగించుకుని అక్రమ కేసులు, వేధింపులకు పాల్పడే అవకాశముందని పేర్కొన్నారు. వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో శనివారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు నామినేషన్ నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు అన్న దశల్లో న్యాయపరమైన సహకారం అందించేందుకు కృషఙ చేయాలని కోరారు. అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకునేలా సహకరించాలని సూచించారు.
ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని లీగల్ టాస్క్ఫోర్స ఏర్పాటు చేసి జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు సమావేశంలో మాట్లాడారు.