– పీఏసీఎస్ చైర్మన్ పొటోళ్ల శ్యామ్ గౌడ్
బీబీనగర్, అక్టోబర్ 03 : రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని పీఏసీఎస్ చైర్మన్ పొట్టోళ్ల శ్యామ్గౌడ్ తెలిపారు. బీబీనగర్ మండలంలోని వెంకిర్యాల, పల్లెగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరికొద్ది రోజుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పల్లెగూడెం సర్పంచ్ అప్పారెడ్డి బలరాంరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు గండు బసవయ్య యాదవ్, ఉప్పలంచి శ్రీకాంత్, అంబెపు బాలరాజ్, సంజీవరెడ్డి, చెరుకు బాలరాజుగౌడ్, నాయకులు చింతల లక్ష్మీనారాయణ, చింతల శ్రీనివాస్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.