IND vs WI : వరస విజయాలతో వన్డే సిరీస్ పట్టేసిన భారత జట్టుకే కేఎల్ రాహుల్(129 నాటౌట్) భారీ స్కోరందించాడు. మూడో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ(92) అర్ధశతకంతో కదంతొక్కగా.. రుతురాజ్ గైక్వాడ్(45)లు శతక భాగస్వామ్యంతో వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆఖర్లో రాహుల్ తన స్టయిల్లో ఉతికేశాడు. లోయర్ ఆర్డర్‌తో కలిసి స్కోర్‌బోర్డును ఉరికించిన అతడు వన్డేల్లో 9వ సెంచరీ సాధించాడు. రాహుల్ దూకుడుతో టీమిండియా 351 పరుగులు చేసింది.
నామమాత్రమైన మూడో వన్డేలో శుభారంభం దక్కకున్నా భారత్ భారీ స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే టీమిండియాకు షాకిస్తూ గత మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ గిల్(1), రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(0)లను జైడన్ సీల్స్(3-62) పెవిలియన్ పంపాడు. వరస బంతుల్లో కీలక వికెట్లు పడినా ఓపెనర్ రోహిత్ శర్మ(92) ఒత్తిడికి లోనవ్వకుండా తన స్టయిల్లో దంచేశాడు. గువాహటిలో సెంచరీతో రెచ్చిపోయిన హిట్‌మ్యాన్ మరో సూపర్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. విండీస్ బౌలర్లను ఎడాపెడా ఉతికేసిన అతడు రుతురాజ్ గైక్వాడ్(57) జతగా స్కోర్బోర్డను నడిపించాడు.
Smiles, cheers, and celebrations all around 🥳
🎥 Scenes to cherish for KL Rahul and #TeamIndia 🤩
Updates ▶️ https://t.co/PhSJSbvW7C#INDvWI | @mflone_ | @klrahul pic.twitter.com/wFTPDqLlvt
— BCCI (@BCCI) October 3, 2026
గైక్వాడ్ సైతం అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ క్రీజునంటుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 137 పరుగులు జోడించి భారీ స్కోర్‌కు పునాది వేశారు. అయితే.. శతకానికి చేరువైన రోహిత్ వెనుదిరిగిన కాసేపటికే అర్ధ శతకం సాధించిన గైక్వాడ్ ఔటయ్యాడు. నమన్ ధిర్(30), నితీశ్ రెడ్డి(9)లు నిరాశపరిచినా కేఎల్ రాహుల్(129 నాటౌట్: 87 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) బాధ్యతగా ఆడాడు. కాస్త కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడిన రాహుల్ 9వ సెంచరీ కొట్టాడు. పాల్ వేసిన ఆఖరి ఓవర్లో వరసగా 6, 6, 4 బాది 22 రన్స్ పిండుకున్నాడు. దాంతో.. నిర్ణీత ఓవర్లలో టీమిండియా7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. వరసగా రెండు వన్డేల్లో చిత్తైన విండీస్ వైట్‌వాష్ తప్పించుకుంటుందా? సిరీస్‌ను 3-0తో భారత్ గెలుస్తుందా? అనేది ఆసక్తి రేపుతోంది.
Stood tall when it mattered 🤝
How important was that Rohit Sharma-Ruturaj Gaikwad partnership? ✨
WATCH them on song ▶️ https://t.co/fIKRSGAg1Q#TeamIndia | #INDvWI | @mflone_ | @ImRo45 | @Ruutu1331 pic.twitter.com/YGt9C81pkL
— BCCI (@BCCI) October 3, 2026