బెంగళూరు: డబ్బు విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన బిల్డర్ అయిన భర్త, భార్య మెడను కాలుతో తొక్కి చంపాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయాడు. (Builder Steps On Wife’s Neck) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. నాగసాంద్ర ప్రాంతంలో నివసించే ధారియప్ప బిల్డర్. ఇంటి ఖర్చుల కోసం ఉంచిన రూ.2 లక్షలు తన సోదరుడికి ఇవ్వాలని అతడు భావించాడు.
కాగా, గురువారం ఈ విషయంపై 35 ఏళ్ల భార్య కావ్య, ధారియప్ప మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన అతడు భార్యను కొట్టాడు. కిందపడిన కావ్య మెడను కాలితో బలంగా తొక్కడంతో ఆమె చనిపోయింది. ధారియప్ప తన భార్య మృతదేహం వద్ద రెండు గంటలపాటు ఉన్నాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆ ఇంటికి చేరుకుని అతడ్ని అరెస్ట్ చేశారు.
మరోవైపు ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీస్ అధికారి తెలిపారు. కుమారుడు పదో తరగతి, కుమార్తె ఇంటర్ చదువుతున్నట్లు చెప్పారు. ఈ సంఘటన జరిగినప్పుడు పిల్లలిద్దరూ ఇంట్లో లేరని వివరించారు. ధారియప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Son stabs mother’s friend | తల్లితో సంబంధంపై అనుమానం.. కత్తితో పొడిచి వ్యక్తిని చంపిన ఆమె కుమారుడు
5 Indians injured in Abu Dhabi | క్షిపణి శకలాలు పడి.. అబుదాబిలో ఐదుగురు భారతీయులకు గాయాలు
Watch: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై ఎద్దు దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?