పటాన్చెరు టౌన్, జూలై 27: అర్హత కలిగిన ప్రతి ఓటరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డి జిల్లా ముత్తంగి డివిజన్ పరిధిలోని పీఎస్ఆర్ గార్డెన్స్‌లో ముత్తంగి డివిజన్, ఇస్నాపూర్ మున్సిపాలిటీల బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మినీ ఇండియాగా పేరున్న పటాన్చెరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఆశించిన మేర జరగడం లేదన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన బూత్‌లెవల్ ఏజెంట్లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనని ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి వారి వివరాలు నమోదు చేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను తొలిగించే అవకాశం ఉందని, ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, నాయకులు పాండు, ఉపేందర్, మోటే శ్రీకాంత్, కుమార్‌గౌడ్, శ్రీనివాస్, మేరాజ్‌ఖాన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎమ్మెల్యే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఓటరు వివరాలను ఎన్యుమరేషన్ పామ్‌లో నింపి సంబంధిత అధికారులకు అందజేశారు.