మహబూబ్ నగర్ : నారాయణపేట నియోజకవర్గం కోయిలకొండ మండలంలోని పారుపల్లి గ్రామానికి చెందిన లవప్ప ( 53 ) అనే వ్యక్తి తహసీల్ కార్యాలయ ( Tahsil Office ) ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని మృతి ( Suicide ) చెందాడు. భూ సమస్యల కోసమే ఉరి వేసుకున్నాడని మృతుని కుమారుడు కురుమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు.