న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి రోజూ ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏదో ఒక అంశంలో ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. అయితే రకరకాల ఆందోళనలను ఒకే వేదికపై నమోదు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. సత్యాగ్రహ(Satyagraha) అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. భూమి కోసం, మహిళా హక్కుల కోసం, దళిత, ఓబీసీ హక్కులు, విద్య, పరీక్షల కోసం దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని, అయితే ఆందోళన చేపట్టేవారు ఇక నుంచి తమ ప్రొటెస్ట్‌ను సత్యాగ్రహ డిజిటల్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకోవాలని రాహుల్ కోరారు. దీని వల్ల ఓ విపక్ష నేతగా తనకు తోచిన రీతిలో ఆ నిరసనలను ప్రభుత్వానికి చేరేలా చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం సత్యాన్ని అణిచివేస్తున్నదని ఆరోపించారు. సత్యాగ్రహ డిజిటల్ ప్లాట్‌ఫామ్ వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా సత్యాగ్రహ ప్లాట్‌ఫామ్‌ను స్టార్ట్ చేశారు.
✊ 𝗦𝗔𝗧𝗬𝗔𝗚𝗥𝗔𝗛𝗔 ✊
𝗥𝗔𝗜𝗦𝗘 𝗬𝗢𝗨𝗥 𝗩𝗢𝗜𝗖𝗘Truth is being suppressed across the country.
From protests over land and women’s rights to the fight for Dalit and OBC rights, education and examinations, people across India are raising their voices and standing up… pic.twitter.com/PjGfZjouI1
— Congress (@INCIndia) October 3, 2026