Sarpanch Suicide | సర్పంచ్ ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలిస్తుండగా యాక్సిడెంట్.. చివరకు మృతి
Sarpanch Suicide | కుటుంబ తగాదాల కారణంగా ఓ మహి ళా సర్పంచ్ ఆత్మహత్యకు య త్నించగా చికిత్స కోసం తరలిస్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది.
Sarpanch Suicide | కడెం, ఏప్రిల్ 3: కుటుంబ తగాదాల కారణంగా ఓ మహి ళా సర్పంచ్ ఆత్మహత్యకు య త్నించగా చికిత్స కోసం తరలిస్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట సర్పంచ్ దుర్గం లహరిక (31)కు కొద్దిరోజులుగా భర్త రాజేశ్తో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపం చెందిన లహరిక శుక్రవారం ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా నచ్చన్ఎల్లాపూర్ వద్ద వీరు ప్రయణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ట్రాక్టర్ నాగళ్లను ఢీకొట్టింది.
కారు నుజ్జునుజ్జుకావడంతో మరో వాహనంలో లహరికను ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. భర్త వేధింపులు తట్టుకోలేకనే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నదని లహరిక తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కడెం ఎస్సై సాయికిరణ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

