తిరుమల : వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల కారు ప్రమాదానికి ( Accident ) గురై ఒకరు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. శుక్రవారం తిరుమల మొదటి ఘాటురోడ్డు( Ghat Road ) లో కారు అదుపుతప్పి పిట్టగోడను ఢీకొని 15 అడుగుల ఎత్తు నుంచి 22 వ మలుపు వద్ద కింద పడిపోయింది.
బెంగళూరులోని గోట్టిగేరికి చెందిన సతీష్‌కుమార్(72) కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు బయలు దేరగా ప్రమాదం చోటు చేసుకుంది. సతీష్‌కుమార్ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించగా కుమారుడు సాయి శ్రీనివాస్, కుమార్తె సింధు ఉడత్, మనవరాళ్లు తియా, నైరాకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.