UP polls 2027 | కాంగ్రెస్ పార్టీకి 55 సీట్లు ఇస్తామన్న సమాజ్‌వాదీ పార్టీ.. 150 కావాలంటున్న కాంగ్రెస్
UP polls 2027 : ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు మరో ఆరు నెలల గడువే ఉంది. ఈ లోపే పొత్తులు కుదుర్చుకోవాలనే ఆలోచనలో పార్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి.
UP polls 2027 : ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు మరో ఆరు నెలల గడువే ఉంది. ఈ లోపే పొత్తులు కుదుర్చుకోవాలనే ఆలోచనలో పార్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రతిపక్షంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 53-55 సీట్లు ఇస్తామని ఎస్పీ ప్రతిపాదించింది. అయితే, తమకు 150 సీట్లు కావాల్సిందే అని కాంగ్రెస్ పట్టుబడుతోంది. దీంతో ఇంకా రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే అధికారంలో ఉంది.
బీజేపీకే సొంత మెజారిటీ కూడా ఉంది. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన బీజేపీ ఇంకా బలంగానే ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీని ఓడించాలంటే ఒంటరిగా పోటీ చేస్తే ప్రయోజనం లేదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీని ఎదుర్కోవాలంటే ఉమ్మడిగా పోటీ చేయడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చాయి. ఇందుకోసం యూపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఎస్పీ, ఆ తర్వాత బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, సీట్ల విషయంలోనే రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడం లేదు. యూపీ అసెంబ్లీలో 403 సీట్లు ఉండగా.. మెజారిటీ కోసం 202 సీట్లు కావాలి.
ఎన్నికలకు ముందుగానే కలిసి పోటీ చేసే అంశంపై పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. సీట్ల విషయంలోనే ఏకాభిప్రాయం కుదరడం లేదు. అయితే, 403 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 55 వరకు సీట్లు మాత్రమే ఇస్తామని ఎస్పీ చెబుతోంది. గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యూపీలో అంత బలంగా లేదని ఎస్పీ అంటోంది. అందుకే, కాంగ్రెస్‌కు భారీ సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ సిద్ధంగా లేదు. ఇటీవలి కాలంలో యూపీ సహా అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ వరుసగా ఓడిపోతున్న సంగతి తెలిసిందే. అందుకే, ఆ పార్టీ ఇప్పుడున్న స్థితికి తక్కువ సీట్లే ఇవ్వడం కరెక్ట్ అన్నది ఎస్పీ వాదన. దీంతో ఎస్పీ దాదాపు 350 సీట్లలో పోటీ చేయాల్సి వస్తుంది.
2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి యూపీ నుంచి 6 సీట్లు మాత్రమే దక్కాయి. ఈ లోక్‌సభ స్థానాల పరిధిలో 30 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉంటాయి. వీటికి ఇంకొన్ని సీట్లు కలిపి 55 వరకు ఇవ్వాలని ఎస్పీ భావిస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ తమకు 150 సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ కలిసి పనిచేశాయి. అప్పట్లో ఎస్పీ 298, కాంగ్రెస్ 105 సీట్లలో పోటీ చేశాయి. ఇందులో ఎస్పీ 47 సీట్లు, కాంగ్రెస్ 7 సీట్లు గెలిచాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Home Guard Killed | బహిరంగంగా మద్యం తాగడాన్ని అడ్డుకున్న హోమ్ గార్డు.. కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు
Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ ప్రోమోకు హరీష్ శంకర్ దర్శకత్వం.. నవంబర్ 4న హైదరాబాద్‌లో ప్రత్యేక షూటింగ్!
Cyclone Murasu | మురాసు తుపాను ప్రభావం.. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు!
RGV | హింసకు సినిమాలే కారణమంటే… కిడ్నాప్‌లకు రామాయణాన్ని అనాల్సిందే: ఆర్జీవీ
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

