నగోయా: ఏషియన్ గేమ్స్‌లో ఇవాళ బాక్సింగ్ ఈవెంట్లో ఇండియాకు మూడు స్వర్ణ పతకాలు లభించాయి. సుబేదార్ బాక్సర్ అంకుశ్ పంగల్(Ankush Panghal)కు కూడా గోల్డ్ మెడల్ దక్కింది. మెన్స్ 80 కేజీల విభాగంలో దుమ్మురేపాడు. దక్షిణ కొరియా ప్రత్యర్థి కిమ్ మిన్ సియాంగ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్లోనూ అంకుశ్ తన పంచ్‌లతో అలరించాడు. నలుగురు జడ్జీలు అంకుశ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చేశారు. పురుషల బాక్సింగ్‌లో అమిత్ పంగల్ తర్వాత అంకుశ్ పంగల్ గోల్డ్ మెడల్ గెలిచాడు. 2018 గేమ్స్‌లో అమిత్ పసిడి సాధించాడు.
Heartiest congratulations to Ankush Panghal on winning the Gold Medal in the Men’s 80kg Boxing event at the #AsianGames2026.
A promising and rising boxer with immense potential. May you soar higher, Champ!#Cheer4Bharat@narendramodi @AmitShah @NitinNabin @blsanthosh… pic.twitter.com/tfa09fB3l6
— S. Phangnon Konyak (@SPhangnon) October 2, 2026