Retired Teacher, Wife Found Dead | రిటైర్డ్ టీచర్, భార్య అనుమానాస్పద మృతి.. హత్యగా పోలీసులు అనుమానం
Retired Teacher, Wife Found Dead | రిటైర్డ్ టీచర్, ఆయన భార్య అనుమానాస్పదంగా మరణించారు. కుమారుడి సమాచారంతో పోలీసులు వారి ఇంటికి చేరుకున్నారు. వృద్ధ దంపతులు హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను ప్రశ్నిస్తున్నారు.
న్యూఢిల్లీ: రిటైర్డ్ టీచర్, ఆయన భార్య అనుమానాస్పదంగా మరణించారు. కుమారుడి సమాచారంతో పోలీసులు వారి ఇంటికి చేరుకున్నారు. వృద్ధ దంపతులు హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. (Retired Teacher, Wife Found Dead) కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలోని షాహ్దారా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. జనవరి 3న తెల్లవారుజామున తల్లిదండ్రులైన 75 ఏళ్ల వీరేంద్ర కుమార్ బన్సాల్, 65 ఏళ్ల పర్వేష్ బన్సాల్ ఇంట్లో అనుమానాస్పదంగా మరణించినట్లు కుమారుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు.
కాగా, మూడో అంతస్తులోని వేర్వేరు గదుల్లో ఉన్న వృద్ధ దంపతుల మృతదేహాలను పోలీసులు పరిశీలించారు. రిటైర్డ్ టీచర్ అయిన వీరేంద్ర కుమార్ ముఖంపై గాయాలు ఉండటాన్ని గమనించారు. దీంతో ఆ వృద్ధ దంపతులను హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
మరోవైపు వృద్ధ దంపతుల హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. దోపిడీ కోణాన్ని తోసిపుచ్చలేమని చెప్పారు. కుటుంబ సభ్యులు, పొరుగువారిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Woman Kills Daughter-In-Law | కొడుకు గ్రాట్యుటీ, ప్రభుత్వ ఉద్యోగం కోసం.. కోడలిని చంపిన అత్త
Massive Fire At Railway Station | రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం.. 200కు పైగా వాహనాలు దగ్ధం
Priyanka Gandhi | ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు.. అస్సాం ఎన్నికల ప్యానెల్‌కు నేతృత్వం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cops
- Delhi
- Found Dead
- home
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

