వర్షాకాలం మొదలైతే చాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తకువగా ఉన్నవారిలో ఈ సమస్యలు తీవ్రంగా ఉంటాయి. అయితే ఈ చికాకులను తగ్గించడానికి ఇంటి చిటాలు ఎఫెక్టివ్‌గా సహాయపడతాయి. అలాంటి వాటిలో వంటింట్లో తప్పనిసరిగా ఉండే మిరియాలు ఒకటి. మసాలా దినుసుగా మాత్రమే కాకుండా, ఆయుర్వేదంలోనూ మిరియాలకు ప్రత్యేక స్థానం ఉంది. వర్షాకాలంలో జలుబు, గొంతు నొప్పిని తగ్గించడంలో మిరియాలు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.
గొంతునొప్పికి విరుగుడు: జలుబు వచ్చినప్పుడు గొంతులో మంట, నొప్పి, గరుకుదనం లాంటి సమస్యలు సాధారణం. గోరువెచ్చని నీటిలో చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకున్నా, తేనెతో కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకున్నా గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గొంతు చికాకును దూరం చేస్తాయి. గొంతులోని కఫాన్ని పలుచన చేసి రిలీఫ్ ఇస్తాయి.
జలుబు, దగ్గు మటుమాయం: నల్ల మిరియాలలో పైపరిన్ ఉంటుంది. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. అంతే కాకుండా.. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు నొప్పి, దగ్గు, ముకు దిబ్బడ సమస్యను పరిషరిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం గొంతులో పేరుకుపోయిన కఫాన్ని కరిగించే గుణం మిరియాలకు ఉంటుంది. దీంతో కఫం బయటికి రావడం సులభమై, ఛాతీలో బరువు కొంత తగ్గుతుంది. ఉపశమనం కోసం మిరియాల పొడిని తేనె లేదా అల్లం టీతో కలిపి తీసుకోండి.
ఇమ్యూనిటీ కోసం: మిరియాలలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్స్ , కెరోటినాయిడ్స్ వంటి శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుషలంగా ఉంటాయి. మిరియాలను తరచు తీసుకుంటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇన్ఫెక్షన్లు, రోగాలు రాకుండా ఉంటాయి. మిరియాలలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు, తేమతో కూడిన వర్షాకాలంలో వృద్ధి చెందే హానికరమైన బ్యాక్టీరియా, క్రిముల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
అయితే మిరియాల వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి. వాటిని ఎకువగా తీసుకోవడం వల్ల కొందరిలో కడుపులో మంట, అసౌకర్యం కలగవచ్చు. చిన్నపిల్లలు, గర్భిణులు, అల్సర్, జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.