న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)కి ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అస్సాం స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమించింది. ఐఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు అధికార ప్రకటన విడుదల చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీలను నియమించారు. ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలోని అస్సాం స్క్రీనింగ్ కమిటీలో సప్తగిరి శంకర్ ఉలక, ఇమ్రాన్ మసూద్, సిరివెల్ల ప్రసాద్ సభ్యులుగా ఉన్నారు.
కాగా, అస్సాంతో పాటు, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లకు స్క్రీనింగ్ కమిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. కేరళ కమిటీకి మధుసూదన్ మిస్త్రీ అధ్యక్షత వహిస్తారు. సయ్యద్ నసీర్ హుస్సేన్, నీరజ్ డాంగి, అభిషేక్ దత్ సభ్యులుగా ఉంటారు.
మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి స్క్రీనింగ్ కమిటీకి టీఎస్ సింగ్ డియో నేతృత్వం వహిస్తారు. యశోమతి ఠాకూర్, జీసీ చంద్రశేఖర్, అనిల్ కుమార్ యాదవ్ సభ్యులుగా ఉంటారు. పశ్చిమ బెంగాల్ కమిటీకి బీకే హరిప్రసాద్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. మహ్మద్ జావేద్, మమతా దేవి, బీపీ సింగ్ సభ్యులుగా ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక, అంతర్గత సంప్రదింపులు వంటి బాధ్యతలను స్క్రీనింగ్ కమిటీలు నిర్వహిస్తాయి.
Also Read:
Trinamool MP Mausam Noor | తృణమూల్‌కు ఎంపీ మౌసమ్ నూర్ గుడ్ బై.. కాంగ్రెస్‌లో చేరిక
New Pension Scheme | ప్రభుత్వ ఉద్యోగులకు.. కొత్త పెన్షన్ పథకం ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం