సిమ్లా: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఒక గ్రామానికి రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆ గ్రామానికి రవాణా సౌకర్యం కూడా కలిగింది. రాజకీయ నేతలు, అధికారులతో కూడిన ట్రయల్ రన్ బస్సు రావడంతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. (Himachal Village Gets Its First Road) హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చావాసి ప్రాంతంలోని తుమాన్ గ్రామానికి 78 ఏళ్లుగా ఎలాంటి రోడ్డు మార్గం లేదు. దీంతో దశాబ్దాలుగా ఆ గ్రామానికి ఎలాంటి రవాణా సౌకర్యం లేక గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాగా, షకెల్డ్ నుంచి తుమాన్ వరకు 2.7 కిలోమీటర్ల రహదారిని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నిర్మించింది. స్థానిక రాజకీయ నేతలు ఇటీవల ఆ రోడ్డును ప్రారంభించారు. దీంతో డిసెంబర్ 29న హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (హెచ్ఆర్టీసీ) తొలిసారి ట్రయల్ రన్ బస్సు నడిపింది. కర్సోగ్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ గౌరవ్ మహాజన్ జెండా ఊపి షకెల్డ్ నుంచి తుమాన్కు బస్సును ప్రారంభించారు. రాజకీయ నేతలు, అధికారులు ఆ బస్సులో ప్రయాణించారు.
మరోవైపు ఆ బస్సు తుమాన్ గ్రామానికి చేరుకోగా అక్కడ ఎదురుచూస్తున్న స్థానిక నేతలు, ప్రజలు చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి వేడుక జరుపుకున్నారు. రోడ్డు నిర్మించి బస్సు సౌకర్యం కల్పించిన పాలకులు, అధికారులకు ఆ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In cities, buses are ignored.
In Tummun, Karsog (Mandi), villagers celebrate a bus with ribbon-cutting and flower garlands 💐
Why?
Because it’s the first time an HRTC bus has reached their village.In the hills, connectivity is celebration.
That’s why HRTC isn’t just… pic.twitter.com/6gk5PL8O1n
— The Modern Himachal (@I_love_himachal) December 30, 2025
Also Read:
Indore Toxic water kills baby | పాలలో నీరు కలిపి పసి బాలుడికి తాగించారు.. అనారోగ్యంతో మృతి