Ayatollah Ali Khamenei : ఇరాన్ మతాధికారి, శక్తివంతమైన నాయకుడైన అయతొల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei)ని అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయేల్ టెహ్రాన్‌పై సైనిక దాడులకు తెగబడ్డాయి. ఇరుదేశాల క్షిపణులు ఖమేనీ నివాసం, కార్యాలయం లక్ష్యంగా దూసుకెళ్లాయి. ఈ దాడుల్లో ఖమేనీ హతమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ మాత్రం ఖమేనీ, అధ్యక్షుడు మృతి చెందారనే వార్తల్ని ఖండించారు. ఖమేనీ, అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రాణాలతోనే ఉన్నారని ఆయన వెల్లడించారు.
టెహ్రాన్‌లో మార్పుకు నాంది పలకాలనే ఉద్దేశంతో అమెరికా, ఇజ్రాయేల్ సంయుక్తంగా దాడులకు పాల్పడుతున్నాయి. ఖమేనీ సహా అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పాటు పలువురు కీలక నేతలను అంతమొందించాలని ట్రంప్, నెతన్యాహు దాడుల్ని ముమ్మరం చేశారు. ఖమేనీ కార్యాలయంపై జరిపిన దాడుల్లో ఆయన చనిపోయారనే వార్తలు వైరలయ్యాయి. అయితే.. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ అవన్నీ వదంతులే అని కొట్టిపారేశారు. ‘నాకు తెలిసినంత వరకూ ఖమేనీ, మసూద్ పెజెష్కియాన్ ప్రాణాలతోనే ఉన్నారు’ అని అల్ అలమ్ టీవీకి ఆయన తెలిపారు.
Do you support this use of military force?
The United States and Israel launched an attack Saturday on Iran, with the first apparent strike happening near the offices of Supreme Leader Ayatollah Ali Khamenei.
Iranian media reported strikes nationwide: https://t.co/9LUS5ThkeO pic.twitter.com/nrYb0c1upT
— Local 12/WKRC-TV (@Local12) February 28, 2026
కానీ, ఇప్పటివరకూ ఖమేనీ ఎక్కడ ఉన్నారు? అనేది మాత్రం ఇరాన్ అధికారులు వెల్లడించలేదు. టఇజ్రాయేల్, అమెరికా దాడులకు ముందే ఆయన టెహ్రాన్‌ను వీడారని, సురక్షిత ప్రాంతంలో తలదాచుకున్నారని రాయిటర్స్ మీడియా సంస్థకు ఇరాన్ ప్రభుత్వం తెలియజేసింది. నిరుడు జూలైలో ఇరాన్‌లోని అణుశక్తి కేంద్రాలే లక్ష్యంగా దాడులకు దిగిన అమెరికా.. ఈసారి మాత్రం పౌరులు, ప్రభుత్వ కార్యాలయాలు.. రాజకీయ నాయకులు ఇళ్లను టార్గెట్ చేసింది.