Allu Arjun | ఇది ఒక తమిళ క్లాసిక్.. ‘డీసీ’ సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసలు!
Lokesh Kanagaraj | తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న ‘డీసీ’ (DC) చిత్రంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే రూ.85 కోట్ల వసూళ్లను సాధించి, రూ.100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తున్న ఈ సినిమాపై ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. '
తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న ‘డీసీ’ (DC) చిత్రంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే రూ.85 కోట్ల వసూళ్లను సాధించి, రూ.100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తున్న ఈ సినిమాపై ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ఈ సినిమా ఒక అద్భుతమైన తమిళ క్లాసిక్ అని, సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన చిత్రమని ఆయన కొనియాడారు. ఈ చిత్రాన్ని అర్థం చేసుకోగలిగే వారికి ఇది ఒక కవితలా ఉంటుందని’ బన్నీ అభివర్ణించారు.
ఇక దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మేకింగ్ స్టైల్‌కు తాను ఫిదా అయ్యానని తెలుపుతూ, చిత్ర బృందం మొత్తానికి ఆయన అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ సినిమాకు ప్రాణం పోసిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పనితీరును అబ్సల్యూట్ మాస్టర్ బూస్టర్‌గా బన్నీ అభివర్ణించారు. సాంకేతికంగా కూడా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిందని ఆయన పేర్కొన్నారు. నటీనటుల విషయానికి వస్తే, వామికా గబ్బి నటన అద్భుతమని మెచ్చుకుంటూనే, ప్రధాన పాత్రలో హీరోగా నటించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ నటనను కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. తన మిత్రుడు లోకేష్ కనగరాజ్ తనకు ఎల్లప్పుడూ ఒక గొప్ప మద్దతుగా ఉంటారని అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు.
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో ముకేష్ జి సినిమాటోగ్రఫీ, ఎడిటర్ ప్రసన్న మరియు స్టంట్ మాస్టర్ పీసీ స్టంట్స్ అందించిన సాంకేతిక సహకారం సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. విడుదలైన కొద్ది కాలంలోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ, సినీ వర్గాల్లో ‘డీసీ’ మూవీ హాట్ టాపిక్‌గా మారింది.
Watched #DC ! It’s a Tamil classic. Every film lover must watch it. It’s poetry for those who get it.
Congratulations to the entire #DC team. Highest respect to Director @ArunMatheswaran garu. @anirudhofficial absolute master booster! Technically brilliant.
All the artists are…— Allu Arjun (@alluarjun) August 17, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

