ముంబై: న్యూఇయర్ సెలబ్రేషన్ కోసం ఒక మహిళ తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ ప్రియుడి ప్రైవేట్ భాగాలను కత్తితో కోసింది. (Woman chops off Lover private parts) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 42 ఏళ్ల వ్యక్తి, 25 ఏళ్ల మహిళ మధ్య ఏడేళ్లుగా సంబంధం ఉన్నది. పెళ్లి కోసం కొంతకాలంగా అతడిని ఆమె ఒత్తిడి చేస్తున్నది.
కాగా, డిసెంబర్ 31 రాత్రికి నూతన సంవత్సర వేడుక కోసం ప్రియుడ్ని తన ఇంటికి ఆ మహిళ పిలిచింది. గురువారం తెల్లవారుజామున పెళ్లి విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన ఆ మహిళ కత్తితో ప్రియుడిపై దాడి చేసింది. అతడి ప్రైవేట్ భాగాన్ని కోసింది.
మరోవైపు తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తన సోదరుడి ఫోన్ చేశాడు. అతడి సహాయంతో ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. అత్యవసర చికిత్స పొందుతున్నాడు.
కాగా, పోలీసులకు ఈ సమాచారం తెలిసింది. దీంతో ప్రియుడి ప్రైవేట్ భాగాన్ని కోసిన ఆ మహిళపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆమె కోసం వెతికి అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Man Beaten To Death | వివాహిత మహిళతో మాట్లాడినందుకు.. యువకుడిని కొట్టి చంపారు
BJP Drops Pune Candidate | ఫడ్నవీస్‌ను విమర్శించినట్లు ఆరోపణలు.. బీజేపీ పూణే అభ్యర్థిని తొలగింపు
Watch: మొబైల్ ఫోన్‌తో వ్యక్తిని స్కాన్ చేసిన పోలీస్.. బంగ్లాదేశీయుడో కాదో గుర్తిస్తుందని వెల్లడి