లక్నో: పోలీసులు ఒక ప్రాంతానికి వెళ్లారు. పౌరసత్వ ధృవీకరణ డ్రైవ్ సందర్భంగా ఒక వ్యక్తిని మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేశారు. అతడు బంగ్లాదేశీయుడో కాదో అన్నది ఆ పరికరం గుర్తిస్తుందని పోలీస్ అధికారి అన్నారు. (Man Scanned With Phone) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 23న కొందరు పోలీసులు, భద్రతా సిబ్బంది కలిసి నిర్బంధ వాహనంలో ఒక ప్రాంతానికి వెళ్లారు. అక్కడ పౌరసత్వ ధృవీకరణ డ్రైవ్ చేపట్టారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబాలకు చెందిన వ్యక్తుల ఆధార వివరాలు, ఇతర ప్రతాలు పరిశీలించారు.
కాగా, ఈ సందర్భంగా ఒక పోలీస్ అధికారి ఒక వ్యక్తిని మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేశారు. అతడి వీపు వెనుక మొబైల్ ఫోన్ ఉంచారు. ఆ వ్యక్తి బంగ్లాదేశీయుడో కాదో అన్నది మొబైల్ ఫోన్లోని పరికరం గుర్తిస్తుందని అన్నారు. వారి పత్రాలు పరిశీలించిన తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు నిర్వహించిన పౌరసత్వ ధృవీకరణ డ్రైవ్ విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒక వ్యక్తి జాతీయతను ధృవీకరించే పరికరం, సాంకేతికత నిజంగా ఉన్నదా? అన్న ప్రశ్నలు వ్యక్తమయ్యాయి.
కాగా, ఆ పోలీసుల తీరు అవమానకరం, అశాస్త్రీయం అని కొందరు మండిపడ్డారు. ఒక వ్యక్తి బంగ్లాదేశీయుడో కాదో అన్నది మొబైల్ ఫోన్ వంటి ఆ పరికరం గుర్తిస్తుందన్న పోలీస్ అధికారి వ్యాఖ్యలపై అధికారిక వివరణ ఇవ్వాలని మరికొందరు డిమాండ్ చేశారు.
“Put the machine on the person’s back. This machine shows you are from Bagladesh”
UP Police in Ghaziabad is roaming around with a “machine” that can detect your nationality. Here the cop could be seen putting a mobile on a person’s back. “This show you are from Bangladesh,” cop… pic.twitter.com/VtFURMx1NR
— Piyush Rai (@Benarasiyaa) January 1, 2026
Also Read:
Parrots Die Of Food Poisoning | ఫుడ్ పాయిజనింగ్ వల్ల.. 200 చిలుకలు మృతి
Watch: మద్యం మత్తులో బారికేడ్లపైకి కారు దూకించిన ఎస్ఐ.. నిలదీసిన పోలీసులపై రంకెలు
Watch: న్యూఇయర్ వేడుకల్లో తాగి హంగామా చేసిన మహిళలు.. వీడియోలు వైరల్