Suryapet | సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు. 9వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన కేసీఆర్, జగదీశ్ రెడ్డి ఫ్లెక్సీలను చింపి కాలువలో పారేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్, జగదీశ్ రెడ్డి ఫ్లెక్సీల చించివేతపై పట్టణ పోలీస్ స్టేషన్లో సూర్యాపేట 9వ వార్డు ప్రజలు, మాజీ చైర్పర్సన్ పెరుమళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అరాచకాలతో అభివృద్ధి జరగదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రౌడీ రాజకీయాలు చేయాలని చూస్తే సహంచేది లేదని హెచ్చరించారు.