Floods | వరదలు పోటెత్తుతున్నాయంటే అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఏ మాత్రం అలర్ట్‌గా లేకున్నా ప్రాణాల మీదికొస్తుంది. గ్రామాల్లో వాగులు పొంగిపొర్లుతుంటే వరదల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండేవారు కొందరైతే.. వరదలు ముంచుకొస్తున్నా లెక్కచేయని వారు మరికొందరు. వరదలు వస్తున్నాయా..? అయినా డోన్ట్ కేర్ అంటూ ఈ ఇద్దరు బైకర్లు ముందుకు సాగారు. వరద ఉద్ధృతికి రెండు బైకులు మానేరు వాగులో పడిపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలను కలిపే పదిర–రామలక్ష్మణపల్లె మానేరు వాగు కాజ్‌వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే అదే సమయంలో ఇద్దరు బైకర్లు వరదను పట్టించుకోకుండా వాగు దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు అదుపుతప్పి బైకులతోసహా వాగులో పడిపోయారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే తాళ్ల సాయంతో బైకర్లను కాపాడి బైకులను కూడా బయటకు తీశారు. సమయానికి స్థానికులు అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది.
వరద ఉద్ధృతికి మానేరు వాగులో పడిపోయిన రెండు బైకులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలను కలిపే పదిర–రామలక్ష్మణపల్లె మానేరు వాగు కాజ్‌వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో వాగు దాటేందుకు ప్రయత్నించిన బైకర్లు
ఈ క్రమంలో అదుపుతప్పి వాగులో పడిపోయిన రెండు… pic.twitter.com/UJwKOGNcCK
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2026
Sukumar | సుకుమార్ కూతురు అరుదైన ఘనత.. సింగర్స్ విభాగంలో ఏకైక విద్యార్థిని!
Earth Quake | లడఖ్‌లో గంటల వ్యవధిలో రెండు భూప్రకంపనలు