హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన ఓటు నమోదు కోసం ఎన్రోల్మెంట్ ఫారమ్‌ను పూర్తి చేసి నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
గతంలో ఓటు వేసిన పట్టభద్రులు కూడా మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. నిర్ణీత గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.
ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకునేలా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. నియోజకవర్గ పరిధిలో ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి అర్హులైన పట్టభద్రులందరికీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.