Sukumar | సుకుమార్ కూతురు అరుదైన ఘనత.. సింగర్స్ విభాగంలో ఏకైక విద్యార్థిని!
Sukumar | స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే నటిగా తన ప్రతిభను చాటుకున్న ఆమె.. ఇప్పుడు సంగీత రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో సుకృతి వేణి సాధించిన ఓ అరుదైన ఘనత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Sukumar | స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే నటిగా తన ప్రతిభను చాటుకున్న ఆమె.. ఇప్పుడు సంగీత రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో సుకృతి వేణి సాధించిన ఓ అరుదైన ఘనత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’ సినిమాలో నటించి సుకృతి వేణి ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రంలో తన నటనకు గాను ఆమెకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు కూడా దక్కింది. దీంతో తండ్రికి తగ్గ కూతురిగా ప్రశంసలు అందుకుంది. అయితే నటనతోనే తన ప్రయాణాన్ని ఆపకుండా.. సంగీతంపై కూడా ఆసక్తి పెంచుకున్న సుకృతి ప్రస్తుతం సింగర్‌గా తన ప్రతిభను నిరూపించుకుంటోంది.
ఇటీవల సౌత్ కొరియాలో జరిగిన ఓ మ్యూజిక్ కాన్సర్ట్‌లో సుకృతి వేణి మెయిన్ సింగర్‌గా పెర్ఫార్మ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆమె ఇంగ్లీష్ సాంగ్‌ను హాలీవుడ్ స్టైల్లో ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె వాయిస్, సింగింగ్ స్టైల్‌కు మంచి ప్రశంసలు దక్కినట్లు తెలుస్తోంది.ఇక తాజాగా సుకృతి వేణి మరో అంతర్జాతీయ అవకాశాన్ని సొంతం చేసుకుంది. అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న ప్రతిష్టాత్మక బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో నిర్వహించనున్న సమ్మర్ మ్యూజిక్ ప్రోగ్రామ్‌కు ఆమె ఎంపికైంది. ఈ ప్రోగ్రామ్ కోసం నిర్వహించిన ఆడిషన్స్‌లో మొత్తం 272 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు సమాచారం. వీరిలో కేవలం 14 మందికి మాత్రమే పూర్తి స్కాలర్షిప్ లభించింది. ఆ 14 మందిలో సుకృతి వేణి కూడా చోటు దక్కించుకోవడం విశేషం.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సింగర్స్ విభాగంలో ఫుల్ స్కాలర్షిప్ పొందిన ఏకైక విద్యార్థిని సుకృతి వేణి అని తెలుస్తోంది. ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయి మ్యూజిక్ సంస్థ నిర్వహించిన ఆడిషన్లో ప్రతిభ చూపించి పూర్తి స్కాలర్షిప్ సాధించడం నిజంగా గొప్ప విషయమని పలువురు అభినందిస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో తన నటనతో అవార్డు అందుకున్న సుకృతి.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంగీతంలోనూ సత్తా చాటుతుండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రి సుకుమార్ సినిమా రంగంలో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా.. కూతురు మాత్రం తనకు నచ్చిన రంగాల్లో ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతోంది. నటనలో నేషనల్ అవార్డు.. అంతర్జాతీయ వేదికపై సింగింగ్ పెర్ఫార్మెన్స్.. ఇప్పుడు ప్రతిష్టాత్మక బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో ఫుల్ స్కాలర్షిప్.. ఇలా వరుస విజయాలతో సుకృతి వేణి పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. భవిష్యత్తులో సంగీత రంగంలో సుకృతి వేణి మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని అభిమానులు, సినీ వర్గాలు కోరుకుంటున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

