కాబూల్: పాకిస్థాన్ వైమానిక దళంపై ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు ఎదురుదాడి చేశారు. అయితే ఆ ప్రతిదాడిలో పాకిస్థాన్ తన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని(F-16 Shot Down) కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రక్షణ శాఖ తన ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేసింది. పాకిస్థాన్ మిలిటరీ వాడుతున్న అమెరికా తయారీకి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం కూలినట్లు తన పోస్టులో ఆఫ్ఘన్ రక్షణ శాఖ తెలిపింది. గురువారం అర్థరాత్రి పాకిస్థాన్ వైమానిక దళం ఆకస్మిక దాడులు చేసిన విషయం తెలిసిందే. కాబూల్, కాందహార్ పట్టణాలపై విరుచుకుపడింది. అయితే ఆ సమయంలో పాక్‌కు చెందిన ఎఫ్-16 కూలి ఉంటుందని భావిస్తున్నారు. కానీ పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం రాత్రి జరిగిన దాడిలో ఎటువంటి జెట్‌ను కోల్పోలేదని స్పష్టం చేసింది.
🚨 BIG BREAKING NEWS💥
This is a Pakistani military F-16, American-made, that Afghan defensive forces have shot down. pic.twitter.com/7qBAjv89rk
— Afghanistan Defense (@AFGDefense) February 27, 2026
ఆఫ్ఘన్ డిఫెన్స్ తన ఎక్స్‌లో పోస్టు చేసిన ఎఫ్-16 వీడియో వైరల్ అవుతున్నది. 85610 సీరియల్ నెంబర్ ఉన్న యుద్ధ విమానం మంటల్లో ఉన్నది. ఆ విమానం బాడీపై పాకిస్థానీ జెండా పెయింట్ కూడా ఉన్నట్లు గుర్తించారు. తమ వైమానిక క్షేత్రంలోకి పాక్ ప్రవేశించినప్పుడు ఎఫ్-16ని కూల్చినట్లు ఆఫ్ఘన్ తాలిబన్ పేర్కొంటున్నది. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. కాబూల్, కాందహార్‌పై జరిపిన దాడుల్లో 133 మంది ఆఫ్ఘన్ తాలిబన్లు మృతిచెందినట్లు పాక్ పేర్కొన్నది. ఆఫ్ఘన్ దళాలు ప్రతి దాడులు కొనసాగిస్తున్నట్లు మరో పోస్టులో ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ శాఖ చెప్పింది. ఖోస్ ప్రావిన్సులో ఉన్న పాకిస్థానీ మిలిటరీకి చెందిన స్థావరాలపై ఆఫ్ఘన్ దళాలు దాడులు నిర్వహిస్తున్నట్లు ఆ పోస్టులో పేర్కొన్నది.
🚨 BIG BREAKING NEWS💥
Retaliatory operations by Afghan forces are still ongoing.
This is Afghanistan’s Khost Province, where Afghan forces are targeting positions of the Pakistani military regime. pic.twitter.com/meivrf56z1— Afghanistan Defense (@AFGDefense) February 27, 2026
ఎఫ్-16 కూలినట్లు వైరల్ అవుతున్న వీడియోపై ఏఐ ఇంజిన్ గ్రోక్ స్పందించింది. ఆ వీడియో నిజమైంది కాదు అని గ్రోక్ పేర్కొన్నది. అసలై ఎఫ్-16 జెట్‌లా ఆ విమానం లేదని గ్రోక్ వెల్లడించింది. ఓ పాత వీడియో ఫూటేజ్‌ను తప్పుగా చూపించినట్లు గ్రోక్ చెప్పింది.
No, this video isn’t real as claimed.
The wreckage shows a large aircraft with tail number 85510 and Pakistani markings, but it doesn’t resemble an F-16 fighter (wrong size/shape). No credible reports from Reuters, Al Jazeera, CNN or others confirm Pakistan losing any plane to…
— Grok (@grok) February 27, 2026