భోపాల్: కలుషిత ఆహారం వల్ల సుమారు 200 చిలుకలు మరణించాయి. ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. బర్డ్ ఫ్లూ కారణంగా చిలుకలు చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అయితే చిలుకల మృతికి ఫుడ్ పాయిజనింగ్ కారణమని పశువైద్యులు నిర్ధారించారు. (Parrots Die Of Food Poisoning) మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బద్వా ప్రాంతంలోని నర్మదా నది ఒడ్డున ఉన్న అక్విడక్ట్ వంతెన సమీపంలో గత నాలుగు రోజుల్లో సుమారు 200 చిలుకలు మరణించాయి. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. బర్డ్ ఫ్లూ సోకడం వల్ల చిలుకలు చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
కాగా, వందలాది చిలుకలు మరణించిన సమాచారం తెలుసుకుని పశువైద్యులు, వన్యప్రాణుల సంరక్షణ శాఖతో పాటు అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చిలుకల కళేబరాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. వాటి మృతికి ఫుడ్ పాయిజనింగ్ కారణమని పశువైద్యులు నిర్ధారించారు. బర్డ్ ఫ్లూ వైరస్ ఆనవాళ్లు కనిపించలేదన్నారు. మరింత పరీక్ష కోసం చిలుకల నమూనాలను జబల్పూర్ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు పొలాల్లో పురుగు మందులు స్ప్రే చేసిన ఆహార గింజలు తినడం, నర్మదా నదిలోని కలుషిత నీరు, సందర్శకులు వదిలేసిన మిగిలిన ఆహారం తినడం వల్ల చిలుకలకు ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్విడక్ట్ వంతెన సందర్శించే వారు పక్షులకు ఆహారం ఇవ్వడాన్ని నిషేధించారు. దీనిని కఠినంగా అమలు చేసేందుకు ఆ ప్రాంతంలో సిబ్బందిని నియమించారు.
Also Read:
Watch: మద్యం మత్తులో బారికేడ్లపైకి కారు దూకించిన ఎస్ఐ.. నిలదీసిన పోలీసులపై రంకెలు
Watch: యువతిని పట్టుకుని కత్తితో బెదిరించి డబ్బు డిమాండ్ చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: న్యూఇయర్ వేడుకల్లో తాగి హంగామా చేసిన మహిళలు.. వీడియోలు వైరల్