లక్నో: ఒక వ్యక్తి బట్టల షాపులోకి ప్రవేశించాడు. ఒక మహిళను నిర్బంధించి ఆమె మెడపై కత్తి ఉంచి బెదిరించాడు. లక్ష ఇవ్వాలని షాపు యాజమానిని బెదిరించాడు. చివరకు స్థానికుల సహాయంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. (Man Holds Woman Hostage at Knifepoint) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 31న రాత్రి 7.30 సమయంలో బిజీగా ఉన్న తాత్కాలిక బట్టల షాపులోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. షాపింగ్ చేస్తున్న ఒక యువతి మెడ చుట్టూ చేయి ఉంచి పట్టుకున్నాడు. కత్తి చూపించి ఆమెను చంపుతానని బెదిరించాడు. తనకు లక్ష ఇవ్వాలని షాపు యజమానిని డిమాండ్ చేశాడు.
కాగా, షాపింగ్ కోసం వచ్చిన కొందరు మహిళలు, ఇతర షాపుల యజమానులు ఇది చూసి షాక్ అయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ వ్యక్తికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆ యువతిని విడిచిపెట్టలేదు. చివరకు స్థానికుల సహాయంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు బారాబంకి జిల్లాలోని సుర్జన్పూర్ గ్రామానికి చెందిన అజిత్‌గా నిందితుడిని పోలీసులు గుర్తించారు. మహిళలపై కత్తి ఉంచి పలుమార్లు అతడు డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆ షాపు యజమాని ఆరోపించాడు. దీంతో అజిత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తున్నారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
उत्तर प्रदेश में कानून-व्यवस्था का पहला दिन।
बिजनौर जिले में एक व्यक्ति ने एक दुकान के अंदर एक नाबालिग लड़की को चाकू की नोक पर बंधक बना लिया और कथित तौर पर मनमानी मांग की बाद में पुलिस ने लड़की को छुड़ा लिया और आरोपी अजीत बाल गोविंद को गिरफ्तार कर लिया। pic.twitter.com/0IsGiE6YEk
— Anuj Agnihotri Swatntra (@ASwatntra) January 1, 2026
Also Read:
Watch: న్యూఇయర్ వేడుకల్లో తాగి హంగామా చేసిన మహిళలు.. వీడియోలు వైరల్
Watch: ఇంటి ముందు కూర్చొన్న వృద్ధురాలు.. కోతులు ఏం చేశాయంటే?
Watch: పోలీస్‌పై కత్తితో దాడికి వ్యక్తి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?