చండీగఢ్: ఇంటి ముందు కుర్చీలో ఒక వృద్ధురాలు కూర్చొన్నది. ఇంతలో కోతుల గుంపు ఆమె దగ్గర నుంచి వెళ్లాయి. కొన్ని కోతులు ఆ వృద్ధురాలిని కరవడంతో పాటు జుట్టు పీకాయి. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Elderly Woman Attacked By Monkeys) హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 26న మధ్యాహ్నం 1:45 గంటల సమయంలో ఒక ఇంటి ముందున్న కుర్చీలో వృద్ధురాలు కూర్చొని ఉన్నది. ఆరేడు కోతులు ఆమె సమీపం నుంచి వెళ్లాయి.
కాగా, ఆ గుంపులోకి ఒక కోతి ఆ వృద్ధురాలి కాలు పైభాగంలో కొరికింది. మరో కోతి ఆమె వీపుపై కొరికింది. మూడో కోతి ఆ వృద్ధురాలి జుట్టు పీకింది. అయితే కోతుల బారి నుంచి ఆమెను కాపాడేందుకు ఒక మహిళ ప్రయత్నించింది. ఆమెపై కూడా కోతులు దాడి చేయగా తృటిలో తప్పించుకున్నది.
మరోవైపు కోతులు కరిచి జుట్టుపీకిన వృద్ధురాలిని సంతోష్ దేవిగా గుర్తించారు. చికిత్స కోసం ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని డాక్టర్లు తెలిపారు. అయితే కోతులు కరిచినందున పలు ఇంజెక్షన్లు చేయాల్సి ఉన్నదని వెల్లడించారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Monkey attacks an elderly lady who was simply sitting on a chair: pic.twitter.com/gMwj7jYY0j
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 31, 2025
Also Read:
Watch: పోలీస్‌పై కత్తితో దాడికి వ్యక్తి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?