చండీగఢ్: ఒక వ్యక్తిని అతడి స్నేహితురాలు మోసగించింది. చెల్లికి క్యాన్సర్ చికిత్స పేరుతో రూ.2.18 కోట్లు దోచుకున్నది. ఆ వ్యక్తి ఫిర్యాదుతో స్నేహితురాలి ఫ్రెండ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళ కోసం వెతుకుతున్నారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. (Gurugram Man Loses Rs 2 Crore) ఒక వ్యక్తిని అతడి స్నేహితురాలు మోసగించింది. తన చెల్లెలు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నమ్మించింది. చెల్లికి చికిత్స పేరుతో 2024 మే నుంచి 2025 ఏప్రిల్ వరకు సుమారు ఏడాది కాలంగా రూ.2.18 కోట్లు అతడి నుంచి తీసుకున్నది. ఆమె బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయించుకున్నది.
కాగా, చెల్లికి క్యాన్సర్ చికిత్స పేరుతో స్నేహితురాలు తనను మోసగించినట్లు ఆ వ్యక్తి తెలుసుకున్నాడు. దీంతో గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
మరోవైపు ఆ మహిళ తన స్నేహితుడితో కలిసి ఆ వ్యక్తిని మోసగించినట్లు గురుగ్రామ్ ఆర్థిక నేర విభాగం పోలీసులు తెలుసుకున్నారు. ఆమె ఫ్రెండ్ అయిన 30 ఏళ్ల అజార్ అహ్మద్‌ను డిసెంబర్ 30న హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌తో గురుగ్రామ్ తరలించారు.
కాగా, అజార్ అహ్మద్ మొబైల్ నంబర్‌తో ఆ వ్యక్తితో మహిళ మాట్లాడినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆమె బ్యాంకు ఖాతాకు ఆ వ్యక్తి పంపిన రెండు కోట్లకుపైగా డబ్బును అజార్ అహ్మద్ తన బ్యాంకు ఖాతాలోకి మళ్లించుకున్నాడని చెప్పారు. ఆ మహిళ ఆచూకీ కోసం అతడ్ని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఆమెను కూడా అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Ex-Cop Dressed As Woman | మహిళ వేషంలో మాజీ పోలీస్.. అత్యాచార నిందితుడు అరెస్ట్
Nomination Papers | శ్మశానవాటికలో నేత.. నామినేషన్ పత్రాలు అక్కడ అందజేసిన పార్టీ
Watch: పోలీస్‌పై కత్తితో దాడికి వ్యక్తి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?