లక్నో: మాజీ పోలీస్ ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పారిపోయిన అతడు తప్పించుకునేందుకు మారువేషాలు వేశాడు. చివరకు మహిళ వేషంలో ఉన్న ఆ నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. (Ex-Cop Dressed As Woman) రాజస్థాన్‌లోని ధోల్పూర్లో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 15న సస్పెండైన మాజీ పోలీస్ రాంభరోస్ అలియాస్ రాజేంద్ర సిసోడియా ఉద్యోగం ఆశతో 16 ఏళ్ల యువతి, ఆమె సోదరుడ్ని తన ఇంటికి పిలిచాడు. సోదరుడ్ని మార్కెట్‌కు పంపి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
కాగా, బాధిత యువతి కేకలు వేయడంతో స్థానికులు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. రాజేంద్ర సిసోడియా తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పారిపోయిన రాజేంద్ర సిసోడియా ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నించారు. అయితే అతడు తన రూపాన్ని మారుస్తూ ఆగ్రా, లక్నో, గ్వాలియర్‌లో తిరిగాడు.
మరోవైపు నిందితుడు రాజేంద్ర సిసోడియా ఉత్తరప్రదేశ్ మథురలోని బృందావన్‌లో ఉన్నట్లు రాజస్థాన్ పోలీసులకు తెలిసింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. బుర్ఖా ధరించి పెదాలకు లిప్‌స్టిక్ వేసుకుని ఆడ వేషంలో ఉన్న నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
కాగా, రాజస్థాన్ సాయుధ కానిస్టేబులరీ (ఆర్ఏసీ)లో పని చేసిన రాజేంద్ర సిసోడియా గతంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటంతో పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
Rajendra Sisodia, wanted in a case of rape with a minor, was found wearing Burqa and sporting lipstick to evade arrested. He was arrested from Mathura, Uttar Pradesh. pic.twitter.com/Oj7q7SHD1H
— Mohammed Zubair (@zoo_bear) December 31, 2025
Also Read:
Watch: పోలీస్‌పై కత్తితో దాడికి వ్యక్తి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Nomination Papers | శ్మశానవాటికలో నేత.. నామినేషన్ పత్రాలు అక్కడ అందజేసిన పార్టీ