ముంబై: ఒక రాజకీయ పార్టీ నేత తల్లి మరణించడంతో అంత్యక్రియల కోసం శ్మశానవాటికలో ఆయన ఉన్నారు. అయితే నామినేషన్ దాఖలుకు గడువు ముగుస్తుండటంతో ఆయన పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. శ్మశానవాటికకు నామినేషన్ పత్రాలు పంపి ఆ నేతకు అందజేసింది. (Nomination Papers In Crematorium) మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి.
కాగా, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పోటీ చేసే అభ్యర్థిగా యోగేష్ గొన్నాడేను చివరి నిమిషంలో ఖరారు చేసింది. అయితే ఆయన తల్లి మరణించడంతో మంగళవారం స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు సాయంత్రం 3 గంటలకు నామినేషన్ గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో శివసేన కీలక నిర్ణయం తీసుకున్నది. నామినేషన్ దాఖలుకు సంబంధించిన ఏబీ ఫారమ్‌ను పార్టీ నేతలతో శ్మశానవాటికకు పంపింది. అక్కడ తల్లికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న యోగేష్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. దీంతో తల్లి అంత్యక్రియల అనంతరం ఆయన చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేశారు.
అయితే నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు నంబర్ 5 అభ్యర్థిగా యోగేష్ గొన్నాడేను షిండే శివసేన పార్టీ నామినేట్ చేసింది. అలాగే ఆయన కుమార్తె కృతికను కూడా వార్డు నంబర్ 8 నుంచి ఎన్నికల బరిలోకి దించింది.
Also Read:
Father Dead, Daughter Starving | ఆకలి బాధతో తండ్రి మృతి.. కృశించిన శరీరంతో కుమార్తె
mother kills daughter | హిందీ మాట్లాడుతున్నదని.. కుమార్తెను హత్య చేసిన తల్లి
Watch: జ్యుయలరీ షాపులో పట్టపగలే చోరీ.. రూ.4.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోపిడీ