ముంబై: మాతృభాషలో కాకుండా హిందీలో కుమార్తె మాట్లాడటంపై తల్లి ఆగ్రహించింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి గొంతునొక్కి హత్య చేసింది. (mother kills daughter) తొలుత గుండెపోటుతో ఆ బాలిక మరణించినట్లుగా నమ్మించేందుకు తల్లి ప్రయత్నించింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది. గురుసంకల్ప్ హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్న 30 ఏళ్ల మహిళకు ఆరేళ్ల కుమార్తె ఉన్నది. ఆ చిన్నారికి చిన్నప్పటి నుంచి మాటలకు సంబంధించిన సమస్య ఉన్నది. ఈ నేపథ్యంలో ఆ బాలిక మరాఠీ బదులు ఎక్కువగా హిందీలో మాట్లాడుతున్నది.
కాగా, బాలిక తల్లి దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పలుమార్లు భర్తకు ఫిర్యాదు చేసింది. అయితే మరాఠీ బదులు ఎక్కువగా హిందీలో మాట్లాడుతున్నదన్న కోపంతో కుమార్తెను హత్య చేసేందుకు ఆమె ప్లాన్ వేసింది. డిసెంబర్ 23న రాత్రి వేళ గొంతునొక్కి చంపింది. పని నుంచి ఇంటికి తిరిగి వచ్చిన మహిళ భర్త కుమార్తె అచేతనంగా ఉండటాన్ని గమనించాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ బాలిక అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. గుండెపోటు కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు పోలీసులకు ఈ సమాచారం తెలిసింది. అయితే చిన్నారి మరణంపై పోలీస్ అధికారికి అనుమానం కలిగింది. దీంతో ప్రత్యేక పోస్ట్‌మార్టం పరీక్షకు ఆదేశించారు. ఊపిరాడకపోవడంతో ఆ బాలిక మరణించినట్లు తేలింది.
ఈ నేపథ్యంలో ఆ చిన్నారి తల్లిదండ్రులను పోలీసులు ప్రశ్నించారు. ఆరు గంటల పాటు విచారణ తర్వాత కుమార్తెను హత్య చేసినట్లు తల్లి అంగీకరించిందని పోలీస్ అధికారి తెలిపారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఆ మహిళ మానసిక ఆరోగ్యపరంగా చికిత్స పొందుతున్నట్లు తెలిసిందని వెల్లడించారు.
Also Read:
Teens Attack Migrant Worker | వలస కార్మికుడిపై కత్తులతో దాడి.. విక్టరీ చిహ్నంతో యువకుల పోజులు
Declares Living Patient Dead | బతికున్న రోగిని చనిపోయినట్లు ప్రకటన.. తర్వాత ఏం జరిగిందంటే?
Newlywed Couple Dies By Suicide | కొత్తగా పెళ్లైన జంట.. కొన్ని రోజులకే వేర్వేరుగా ఆత్మహత్య