చెన్నై: రైలులో ప్రయాణించిన వలస కార్మికుడిని కొందరు యువకులు వేధించారు. ఆ తర్వాత కత్తులతో అతడిపై దాడి చేశారు. విక్టరీ చిహ్నంతో పోజులిస్తూ రీల్ రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. (Tamil NaduTeens Attack Migrant Worker) తమిళనాడులో ఈ సంఘటన జరిగింది. చెన్నై నుంచి తిరుత్తణి వెళ్తున్న లోకల్ రైలులో మహారాష్ట్రకు చెందిన వలస కార్మికుడు ప్రయాణించాడు. 17 ఏళ్ల వయస్సున్న నలుగురు యువకులు రైలులో అతడ్ని వేధించి కొట్టారు.
కాగా, గంజాయికి బానిసలైన నలుగురు యువకులు ఆ తర్వాత ఒక ఇంటి వద్ద ఆ వలస కార్మికుడిపై కత్తులతో దాడి చేశారు. రక్తం కారుతున్న అతడితో విక్టరీ పోజులిచ్చారు. దీనిని రికార్డ్ చేశారు. తమిళ పాట మ్యూజిక్‌తో కూడిన ఈ రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు గాయపడిన వలస కార్మికుడు తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంతున్నాడు. అతడిపై కత్తులతో దాడి చేసిన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని చెంగల్పట్టులోని జువైనల్ హోమ్‌కు తరలించారు. చదువు కోసం కోర్టు అనుమతి కోరిన నాల్గవ యువకుడిని బెయిల్‌పై విడుదల చేశారు.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో తమిళనాడులో శాంతిభద్రతల పరిస్థితులపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంపై మండిపడ్డాయి.
A migrant worker from MP was brutally attacked by four minors in Tamil Nadu. They even flash ‘victory’ sign while doing it…
The guy is fighting for life in hospital….
pic.twitter.com/xqA5RcroT8— Mr Sinha (@MrSinha_) December 29, 2025
Also Read:
Newlywed Couple Dies By Suicide | కొత్తగా పెళ్లైన జంట.. కొన్ని రోజులకే వేర్వేరుగా ఆత్మహత్య
Declares Living Patient Dead | బతికున్న రోగిని చనిపోయినట్లు ప్రకటన.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రాత్రి వేళ స్కూటీపై వెళ్తున్న మహిళ.. వెంటపడి వేధించిన ముగ్గురు