‘మీ ఫోన్ సేఫేనా? లేదా అది మీ మీదే నిఘా పెట్టిందా?’ మీరు చదివింది కరక్టే. అంత అయోమయంగా చూడొద్దు. ఎందుకంటే.. అప్పుడప్పుడు మనపై మనకే డౌట్ వచ్చినట్టుగా.. మన ఫోన్‌ని కూడా ఇప్పుడు నమ్మలేని పరిస్థితులు వస్తున్నాయి. ‘నా ఫోటోను ఎవరో తప్పుగా వాడుతున్నారా?’, ‘నా బ్యాంక్ అకౌంట్ సేఫ్‌గా ఉందా?’, ‘ఏఐ చెప్పేదంతా నిజమేనా?’.. ఇలా అడుగడుగునా ఎన్నో ప్రశ్నలు. సమాధానం.. ‘జాగ్రత్త! ఆల్ ఈజ్ వెల్’. ఎందుకంటే ఇప్పుడంతా మాట్లాడుకునేది ఫోనూ.. ప్రైవసీ గురించే. ఐటీ, బ్యాంకింగ్, విద్యా రంగాల్లో డిజిటలైజేషన్ వేగంగా మారుతున్న తరుణంలో మెట్రో నగరాల్లో సైబర్ నేరాలు కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ‘AIతో పెరుగుతున్న సైబర్ నేరాలు, డీప్‌ఫేక్స్, డేటా లీకుల’పై ఓ టెక్నాలజీ నిపుణుడు చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? ‘ప్రైవసీ విషయంలో రాజీపడొద్దు.. ప్రైవసీ ఫస్ట్!!’. ఇదో స్టేట్మెంట్ కాదు.. మనందరికీ ఒక హెచ్చరిక!
మనం రోజూ ఏదో ఒక యాప్‌ను ఓపెన్ చేస్తాం.. ఏదో ఒక వెబ్సైట్లో లాగిన్ అవుతాం. ‘Allow Permissions?’ అని అడుగుతుంది.. మనం యాక్సెప్ట్ కొడతాం. అంతే.. పని అయిపోయింది అనుకుంటాం. కానీ, అక్కడే ఒక ముఖ్యమైన ట్రాన్సాక్షన్ జరుగుతున్నది! అదే Online Consent- ఆన్లైన్ ఒప్పందం. మీ వ్యక్తిగత డేటాను ఆయా మాధ్యమాలు యాక్సెస్ చేసేలా.. మీకు మీరుగా సమ్మతించడం అన్నమాట. ఒకసారి ఇలా ఊహించుకోండి.. మీరు ఒక కొత్త షాపింగ్ యాప్ ఇన్స్టాల్ చేశారు. అది మీ కాంటాక్ట్స్, గ్యాలరీ, లొకేషన్ యాక్సెస్ కోరింది. మీరు ‘Allow’ చేశారు. ఇప్పుడు ఆ యాప్ మీ డేటాను ఎలా వాడుతుందో మీకు తెలుసా? డార్క్‌సైడ్ డేటా మ్యానిప్యులేషన్ చేస్తుంది. అదే మనం మాట్లాడుకోవాల్సిన విషయం!
భద్రత.. స్వేచ్ఛ.. రెండూ కావాలి!
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఇచ్చిన సందేశం ఒక్కటే.. టెక్నాలజీలో ప్రగతి ఉండాలి. కానీ, ప్రైవసీ కట్టుదిట్టం చేయాలి. సైబర్ నేరాలను అడ్డుకోవాలి.. అలాగే, నిర్దోషుల హక్కులు కూడా కాపాడాలి! కొత్త ఆవిష్కరణలు కావాలి.. కానీ వాటిని నమ్మకంగా వాడుకునే విధానాలు రూపొందిచాలి. అది ఆన్లైన్ సర్వీస్ కావచ్చు, ఆఫ్‌లైన్ సేవలు అయ్యుండొచ్చు. మితిమీరి మన నుంచి డేటాను సేకరించడానికి చూస్తే అడ్డుకోవడం మన ప్రాథమిక హక్కుగా భావించాలి. బయటి ప్రపంచంలో ‘నో’ చెప్పడానికి ఎలా సంకోచించమో, అలాగే ఆన్లైన్లో మన ప్రైవసీని కాపాడుకునేందుకు ఎలాంటి ‘యాక్సెస్’కి అయినా ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోవాలి.
చట్టం కల్పించిన హక్కు..
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ (DPDTA) లాంటి చట్టాల ప్రకారమే ఈ ఆన్లైన్ కాన్సెంట్ జరుగుతుంది. ఏదైనా వెబ్ సర్వీస్, యాప్ యూజర్ డేటాను యాక్సెస్ చేయడానికి ముందు.. అన్ని వివరాలను క్షుణ్నంగా తెలియజేయాలి. సేకరించిన డేటాను దేనికి వాడతారు? ఎక్కడ భద్రపరుస్తారు? ప్రైవసీని ఎలా కాపాడుతారు?.. ఈ వివరాలను విధిగా యూజర్ తెలుసుకునే హక్కు ఉంది. అందుకే.. సైబర్ చట్టాలు, అవి కల్పించే హక్కులను ప్రతి నెటిజన్ తెలుసుకున్నప్పుడే నెట్టింట్లో భద్రంగా మనగలడు. లేకపోతే.. సోషల్ మీడియా, క్లౌడ్ స్టోరేజ్‌లలో ఏండ్ల పాటు భద్రం చేస్తున్న వ్యక్తిగత వివరాలు.. ఏదో ఒక రోజు మిమ్మల్ని వీధిన పడేస్తాయన్న విషయాన్ని మర్చిపోవద్దు! ఎంతలా అంటే.. మీరు ఒక ఫిట్నెస్ యాప్‌నకు లొకేషన్ యాక్సెస్ ఇచ్చారు. కానీ, ఆ యాప్ మీ లొకేషన్ డేటాను యాడ్ కంపెనీలకు అమ్మేసింది అనుకుందాం. అంతే.. మీకు రిలేటెడ్ యాడ్స్ ఎప్పటికప్పుడు వచ్చేస్తుంటాయ్. ఎక్కడికి వెళ్తే అక్కడి లోకల్ యాడ్స్ పాప్ అవుతుంటాయ్.. ఇదంతా డేటా మిస్యూజ్ మహిమే!!
మేనేజ్ చేయడం ఎలా?
పిల్లలతో కేర్‌ఫుల్!
-అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్