భువనేశ్వర్: ఒక జంటను రోడ్డుపై దారుణంగా కొట్టారు. అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు వెదురు కర్రలతో వారిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. (Couple thrashed On Road) ఈ నేపథ్యంలో ఈ దారుణంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశాలోని బెర్హంపూర్‌లో ఈ సంఘటన జరిగింది. మే 18న రాత్రి వేళ రద్దీగా ఉన్న రహదారిలో యువ జంటపై దాడి జరిగింది. జనం చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు వెదురు కర్రలతో వారిని కొట్టారు. జోక్యం చేసుకునేందుకు కొందరు ప్రయత్నించగా, మరికొందరు ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. దాడిలో గాయపడిన ఆ జంటను ఆ తర్వాత చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నడి రోడ్డుపై ఒక జంటను పబ్లిక్‌గా దారుణంగా కొట్టడంపై ప్రజాగ్రహం వ్యక్తమైంది. ఒడిశాలో శాంతిభద్రతలు లోపించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు వైరల్ అయిన వీడియో క్లిప్‌పై పోలీసులు స్పందించారు. పాత శతృత్వం కారణంగా ఆ జంటపై దాడి జరిగి ఉంటుందని అనుమానించారు. బాధితుల నుంచి తమకు ఫిర్యాదు అందలేదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
A minor scooter-car touch in Odisha’s Giri Road Chowk turned into brutal road rage after car occupants allegedly assaulted a young man and broke both his legs. His fiancée was also attacked while trying to save him
Vehicles are insured for accidents and damages, not for violence pic.twitter.com/N87DpQuYOp— Highway Heroes Of india (@raginis14728168) May 19, 2026