Aamir Khan | ఆమిర్ ఖాన్కు బెదిరింపు సందేశాలు.. ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రత, దర్యాప్తు ముమ్మరం
Aamir Khan | బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్కు బెదిరింపు సందేశాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతుండటంతో ముంబైలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఆయన నివాసం వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు సమాచారం. ఈ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులు లేదా వర్గాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఆడియో క్లిప్లు వైరల్ అయ్యాయి.
Aamir Khan | బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్కు బెదిరింపు సందేశాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతుండటంతో ముంబైలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఆయన నివాసం వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు సమాచారం. ఈ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులు లేదా వర్గాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఆడియో క్లిప్లు వైరల్ అయ్యాయి. వాటిలో ఆమిర్ ఖాన్ను బెదిరించినట్లు అనిపించిందని, ఆ క్లిప్లు నిజమైనవేనా? లేక మార్ఫింగ్ చేసినవా? అనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్ ఆధారాలను సేకరిస్తూ, ఈ సందేశాల మూలాన్ని గుర్తించే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమయ్యారు.
ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు, ఆడియో సందేశాల నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని పోస్టుల్లో “లవ్ జిహాద్” వంటి అంశాలను ప్రస్తావిస్తూ నటుడికి హెచ్చరికలు జారీ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలోని ఆరోపణలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ వెలువడలేదు. వైరల్ అవుతున్న కొన్ని సందేశాల్లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును కూడా ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఈ బెదిరింపులకు ఆ గ్యాంగ్కు నిజంగా సంబంధం ఉందా? లేక వారి పేరును దుర్వినియోగం చేశారా? అనే అంశాన్ని పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు.
ఈ సందేశాలను రూపొందించినవారు, వాటిని సోషల్ మీడియాలో వ్యాప్తి చేసినవారిని గుర్తించేందుకు సైబర్ విభాగం కూడా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఆమిర్ ఖాన్ ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. భద్రత పెంపు, దర్యాప్తు వంటి అంశాలపై కూడా ఆయన మౌనం పాటిస్తున్నారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో అధికారికంగా స్పందించకుండా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమిర్ ఖాన్ ప్రస్తుతం పలు సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ‘లాహోర్ 1947’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, కేసులో వెలుగులోకి వచ్చే ఆధారాల ఆధారంగా భద్రతా ఏర్పాట్లపై తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

