Bomb attack ,Bangladesh ,Cricketer Shakib Al Hasan, Shake haseena
Shakib Al Hasan | బంగ్లాదేశ్(Bangladesh )మాజీ క్రికెట్ కెప్టెన్, మాజీ అవామీ లీగ్ ఎంపీ షకీబ్ అల్ హసన్‌కు(Shakib Al Hasan )సొంత దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమువుతున్నది. మాజీ ప్రధాని షేక్ హసీనా పాలనకు మద్దతుగా ఉంటున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న షకీబ్ ఇప్పటికే పలు కేసులు నమోదు కావడంతో మాతృ దేశానికి దూరంగా ఉంటుంన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన స్వ గ్రామంలోని నివాసంపై దాడి జరిగింది. అలాగే దేశరాజాధాని ఢాకాలో కూడా షకీబ్‌కు చెందిన ఆస్తులను కొందరు దుండగులు ధ్వంసం చేయడమే కాకుండా పెట్రోల్ బాంబు విసిరారు. ఈ దాడి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, న్యూఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్లో షేక్ హసీనా వర్చువల్ విలేకరుల సమావేశంలో ప్రసంగించిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. దాడులపై అవామీ లీగ్ పార్టీ తీవ్రంగా స్పందించింది. నివాసాలకు నిప్పు పెట్టడం, ఆస్తులను ధ్వంసం చేయడం, హత్యలకు పాల్పడటం వంటి చర్యలతో బంగ్లాదేశ్‌ను నయా ఫాసిజం కబళిస్తోంది అని ఒక ప్రకటనలో పేర్కొంది.
Torching residences : the cost of attending Awami League press conference
Neo fascism engulfs BangladeshA grisly petrol bomb attack took place at the residence of Bangladesh’s celebrated cricket icon Sakib Al hasan, hours after the world famous star cricketer appeared at a… pic.twitter.com/Uqmwwih3XG
— Bangladesh Awami League (@albd1971) August 5, 2026