హైదరాబాద్ : డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన కూకట్పల్లి పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ముఖేష్ కుమార్, ఖాన్ ఇద్దరు స్నేహితులు.
వీరి మధ్య డబ్బుల విషయంలో గొడవ తలెత్తడంతో ముఖేష్‌ను ఖాన్ కత్తితో పొడిచి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.