(రంగనాథ్ మిద్దెల)
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 15 (నమస్తే తెలంగాణ) : దక్షిణ డిస్కమ్‌లో కొందరు అధికారులు, ఆర్టిజన్ల అక్రమాలు సాధారణ స్థాయి నుంచి న్యాయస్థానాల తీర్పుల ఉత్తర్వు లు మార్చే స్థితికి చేరాయి. డబ్బుల కోసం వృ త్తిధర్మాన్ని మరిచి ఇలాంటి వ్యవహారాలతో సంస్థ ప్రతిష్ఠనే రచ్చకీడ్తున్నారు. తాజాగా గురుకుల్ ట్రస్ట్‌తోపాటు కొన్ని ప్రభుత్వ నిషేధిత జా బితాలో ఉన్న భూములకు అక్రమంగా విద్యు త్తు కనెక్షన్లు ఇస్తున్నట్టు వెలుగుచూసింది. డ బ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారనడానికి టీజీఎస్పీడీసీఎల్లోని కొన్ని సెక్షన్లలో జరుగుతు న్న పనులే ఇందుకు నిదర్శనం. ‘నమస్తే తెలంగాణ’లో నాయకుడు, అతని బలగం పేరుతో శనివారం వచ్చిన కథనంతో దక్షిణ డిస్కమ్ ప రిధిలోని పలు సెక్షన్లలో ప్రత్యేకించి రంగారెడ్డి జోన్లో జరుగుతున్న అక్రమాలు మరిన్ని వె లుగుచూశాయి. నిషేధిత భూముల్లో కనెక్షన్లు ఇవ్వకూడదంటూ కోర్టు ఉత్తర్వులు ఉన్నా న్యా యస్థానాల తీర్పులను మార్చేసి నకిలీ ఉత్తర్వు లు సృష్టిస్తున్నారు.
ఓ కేసుపై వచ్చిన తీర్పు త మకు అనుకూలంగా వచ్చినట్టు చూపించేలా డిస్కమ్‌లో కొందరు సర్కిల్ అధికారులు, మ రికొందరు ఆర్టిజన్లు కలిసి చేసిన వ్యవహారం సంచలనంగా మారింది. ఏదో ఒక కేసుకు సంబంధించిన తీర్పు తీసుకొని వచ్చి దానిలో ఉన్న సబ్జెక్ట్, పిటిషనర్లు తదితర వివరాలు మా ర్చేసి అదే నంబర్‌తో ఎస్పీడీసీఎల్తోపాటు విద్యుత్తుశాఖకు సంబంధించిన అన్ని విభాగాలను ఆదేశించినట్టుగా ఫిర్యాదుదారుకు అనుకూలంగా తీర్పు వచ్చినట్టు నకిలీ తీర్పు తయారుచేసిన వైనం అధికారుల అక్రమాలకు పరాకాష్టగా చెప్పాలి. ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయిలో ఈ వ్యవహారంపై ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. తమను అడ్డుకునేవారు లేరంటూ 9 మంది సిబ్బందితో కలిసి అక్కడి అధికారులు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. జోన్‌లోని ఒక ప్రధా న అధికారితోపాటు ఆ కార్యాలయంలోని జనరల్ అధికారి అండదండలతో ఈ వ్యవహారం జరుగుతున్నట్టు తెలిసింది.
నిషేధిత భూముల్లో మీటర్లు..
సైబర్‌సిటీ సర్కిల్లోని కొండాపూర్ సబ్‌డివిజన్‌లో జరిగిన బాగోతాన్ని చూస్తే ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో తెలుస్తున్నది. గురుకుల్ ట్రస్ట్ భూములు, అయ్యప్ప సొసైటీ ప్రాంతాల్లో భూమి హక్కులు, వివాదాస్పద ఆస్తులు, రిజిస్టర్ కాని డాక్యుమెంట్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అక్రమంగా కనెక్షన్లు ఇస్తున్నారు. ఖానామెట్ సర్వే నంబర్ 11/20,11/21లోని వివాదాస్పద భూములకు సంబంధించి ప్రభుత్వ నిషేధిత జాబితా 22/ఏలో ఉన్నాయి. ఇక్కడ నిర్మాణాలకు చట్టబద్ధమైన అనుమతులు లేవు. విద్యుత్తు కనెక్షన్లకు నిబంధనలు అడ్డువస్తుండడంతో పాత కనెక్షన్లను వీటికి బదలాయించేందుకు అక్రమార్కులు పెద్దఎత్తున డబ్బులు డిమాండ్ చేసి ఆ పనిని చక్కబెట్టారు. ఇక నిషేధిత భూము ల్లో నిర్మాణాలుండి సర్వీస్ కావాలనుకున్న వారికి ఇస్తూ ఒక్కో కనెక్షన్‌కు రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు వసూలు చేస్తున్నారంటూ చెప్తున్నారు. ఒక్కో దశకు ఒక్కో రేటు నిర్ణయించిన ఈ అక్రమార్కులు కనెక్షన్ల కోసం కోర్టు ఉత్తర్వులతో సహా పలు పత్రాలనూ ఫోర్జరీ చేసినట్టు సమాచారం. ఇదంతా ఇద్దరు ఆర్టిజన్లు, ఇద్దరు ఇంజినీర్ల భాగస్వామ్యంతో జరుగుతున్నదంటూ తెలుస్తున్నది.
హైకోర్టు ఉత్తర్వులే మార్చారు..
కొండాపూర్ సర్కిల్లో పనిచేస్తున్న ఇద్దరు ఆర్టిజన్ల నుంచే దందా మొదలవుతున్నది. వారికి యూడీఎస్లకు సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా తెలిసినందున ఆ సర్వీసులను పునరుద్ధరించడానికి అవసరమైన తతంగం పూర్తిచేస్తున్నారు. రికార్డుల్లో ఏండ్ల తరబడి ఉన్న పాతసర్వీసులను గుర్తించి వాటికి ఫోర్జరీ పత్రాలతో పేరు, చిరునామా మార్చి కొత్త నిర్మాణాలకు మళ్లిస్తున్నారు. ఇందుకోసం హైకోర్టు, చీఫ్ ఇంజినీర్ల ఉత్తర్వులను సైతం నకిలీవి సృష్టిస్తున్నారు. కొండాపూర్ సెక్షన్‌కు సంబంధించి ఓ విద్యుత్తు కనెక్షన్ కోసం 35089/2025 కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పు పత్రాలు కీలకంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి ఈ కోర్ట్స్ సైట్లో అందుబాటులో ఉన్న ఉత్తర్వుల ప్రకారం సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఈ కేసు డీ సూర్యప్రకాశ్ అనే వ్యక్తికి స్టేట్ ఆఫ్ తెలంగాణ, కమిషనర్ ఆఫ్ పోలీస్, డీసీపీ, ఏసీపీ, ఎస్హెచ్ఓల మధ్య జరిగింది. ఈ కేసు 19.11.2025న డిస్పోజ్ అయినట్టుగా ఒరిజినల్ రికార్డులు చెప్తున్నాయి.
కానీ డిస్కమ్ అధికారుల సహకారంతో అక్కడి ఆర్టిజన్లు సృష్టించిన ఉత్తర్వులు మాత్రం వేరొక పేరుతో ఉండడం గమనార్హం. విద్యుత్తు శాఖకు సమర్పించిన 35089/2025 కేసు నంబర్‌తో ఉన్న ఉత్తర్వుల్లో పిటిషనర్ పేరు నీతాఠాకూర్ కాగా, ప్రతివాదులుగా ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎస్పీడీసీఎల్ సీఎండీ, ఎస్ఈ, డీఈ, ఏడీఈలతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఉన్నారు. తీర్పు మాత్రమే కాదు ఏకంగా తీర్పు ఇచ్చిన జడ్జిని కూడా మార్చేశారు. ఇలా ఈ ఒక్క కేసు కాదు.. నిషేధిత భూముల నిర్మాణాల్లో గత తొమ్మిది నెలలుగా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, రంగారెడ్డి జోన్లో ముఖ్య నాయకుడు, అధికారి అండదండలతో ఇలాంటి అక్రమాలు జరిగాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కనెక్షన్నీ అక్రమమేనా?
కొండాపూర్, అల్లాపూర్ సెక్షన్లలో 12001 కోడ్‌తో ప్రారంభమయ్యే సర్వీసు కనెక్షన్లు అక్రమమేనని స్థానిక విద్యుత్తు అధికారులు చర్చించుకుంటున్నారు. ఈ కనెక్షన్లు మాత్రమే ఉన్నా యా? మరేదైనా కోడ్‌తో అక్రమంగా ఉన్నా యా? తేలాల్సి ఉన్నది. ఇటీవల ఈ దందా కొంత వెలుగుచూడటంతో సీఎండీ జితేశ్‌పాటిల్ సీరియస్ అయ్యారని, దీంతో కొన్ని మా త్రమే తొలగించి మిగతావాటిని కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికీ వందకు పైగా కనెక్షన్లు మనుగడలోనే ఉన్నట్టు సమాచారం. ఈ కనెక్షన్ల కోసం ఒకవైపు డబ్బులు చెల్లించి, మ రోవైపు కరెంట్ కనెక్షన్లు తొలగించడంతో ఆ గృ హాల యజమానులు ఇబ్బందులు పడుతున్నా రు. వీటి విషయంలో జోన్ ముఖ్య అధికారి స్పందించకుండా చూసుకున్న ఇద్దరు సిబ్బంది తమ పని తాము చేసుకుపోతున్నారు. యూడీఎస్ కింద ఉన్న పాత మీటర్లను నిషేధిత భూ ముల్లోని నిర్మాణాలకు కనెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో పాత సర్వీస్ కనెక్షన్ చిరునామా, తర్వాత నమోదైన చిరునామా, వినియోగదారుడి పేరు, క్యాటగిరీ, లోడ్, ట్రాన్స్ఫార్మర్ మంజూరు తదితర అంశాలను పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడనున్నది.

35089/2025 కేసుకు సంబంధించిన నకిలీ హైకోర్టు తీర్పు ఉత్తర్వు కాపీ.. ఇందులో పిటిషనర్ పేరు నీతాఠాకూర్గా ఉన్నది. ఇందులో ప్రతివాదులుగా విద్యుత్తుశాఖ అధికారులు ఉన్నారు.

ఈ కోర్ట్స్‌లో ఇదే నంబర్‌కు సంబంధించి అసలు కాపీ.. ఇందులో పిటిషనర్ సూర్యప్రకాశ్ పేరుతో ఉన్నది. ఇందులో ప్రతివాదులుగా
సీపీ, డీసీపీ, ఏసీపీ, ఎస్హెచ్ఓలు ఉన్నారు.