కుమ్రం భీం ఆసిఫాబాద్ : కల్యాణలక్ష్మి ( Kalyana Lakshmi ) , షాదీ ముబారక్ స్కీంలతో పేదింటి ఆడబిడ్డలకు మేనమామల కేసీఆర్ ఆదుకున్నారని బీఆర్ఎస్ ఆసిఫాబాద్ ( BRS Asifabad ) నాయకులు అన్నారు. ఈ రెండు పథకాలను ప్రారంభించి 12 సంవత్స రాలు గడుస్తున్న సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శాసన సభ్యురాలు కోవ లక్ష్మి ఆదేశాల మేరకు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ. 1,00,116 కానుకగా అందించాలన్న ఆలోచన కేసీఆర్కు తప్ప, ప్రపంచంలోని ఏ నాయకుడికి రాలేదని పేర్కొన్నారు. ఈ పథకాలు రాష్ట్రంలో బాల్య వివాహాలను కూడా తగ్గించిందని వెల్లడించారు. గత పన్నెండేళ్లలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 16.78 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కల్యాణలక్ష్మి పథకాన్ని నీరుగార్చడమే కాకుండా, పూర్తిగా రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీ భాయ్ , మారుసుకోలా సరస్వతి , కౌన్సిలర్లు సలాం, రాజంపేట సర్పంచ్ పోషన్న, ఉపయోగం సర్పంచ్ లక్ష్మి , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంధం శ్రీనివాస్ , టౌన్ అధ్యక్షుడు ఆహేమద్ బిన్ అబ్దుల్లా , నిస్సార్ , సమద్ , సాయి శ్రవణ్ , గుండా శ్యామ్ ,రవి, యాదగిరి , మహిళా నాయకులు సుప్రజ , ఉమ , భీం భాయి తదితరులు పాల్గొన్నారు.