నగోయా: భారత బాక్సర్ పర్వీన్ హూడాకు స్వర్ణ పతకం దక్కింది. జపాన్‌లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో ఆమె 65కేజీల విభాగంలో గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నది. ఈ గేమ్స్‌లో ఇండియాకు ఇది 13వ స్వర్ణం. తాజా గేమ్స్‌లో భారత్ అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నది. ఏషియన్ గేమ్స్ బాక్సింగ్ ఈవెంట్లో భారత్‌కు ఇవాళ రెండు స్వర్ణాలు లభించాయి. ఉదయం లవ్లీనా కూడా తన పంచ్‌తో గోల్డ్ మెడల్ కొట్టిన విషయం తెలిసిందే. సింగిల్ ఎడిషన్‌లో రెండు స్వర్ణాలు రావడం ఇదే మొదటిసారి. అయితే చాలా కఠినమైన ప్రత్యర్థులను పర్వీన్ ఎదుర్కొన్నది. తొలి రెండు రౌండ్ల వరకు స్కోర్లు టైగా ఉన్నాయి. మూడో రౌండ్లోనూ హోరాహోరీ సాగినా .. స్వర్ణ పతకం ఇండియన్ బాక్సర్‌ను వరించింది. ప్రత్యర్థి చైనీస్ తైపెయి ప్లేయర్ చెన్ నెన్ చిన్‌పై పర్వీన్ విజయం సాధించింది. 2022 ఏషియన్ చాంపియన్‌గా నిలిచింది పర్వీన్ హూడా. 2022 వరల్డ్ చాంపిన్షిప్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నది.
Unstoppable in the ring! 🥊🥇🇮🇳
Congratulations to Parveen Hooda for striking GOLD in the Women’s 65kg Boxing event at the #AsianGames2026. Keep shining, champ! #Cheer4Bharat pic.twitter.com/Qt5soRSU1E
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 2, 2026