జైపూర్: ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు స్కూల్ వేళల్లో నేలపై నిద్రించాడు. ఆయన గుర్రుపెట్టి గాఢ నిద్రలో ఉన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ప్రధానోపాధ్యాయుడి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారుల దృష్టికి ఇది వెళ్లింది. (Principal Sleep in School) రాజస్థాన్లోని కరౌలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తోడాభీమ్ ప్రాంతంలోని భండారి అండ్రునిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు డ్యోడిరామ్ మీనా ఎంచక్కా నేలపై నిద్రించాడు. గుర్రుపెట్టి గాఢ నిద్రలో ఉన్న ఆయనను చూసి మిగతా టీచర్లు, విద్యార్థులు విస్తూ పోయారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆ ప్రధానోపాధ్యాయుడి తీరును విమర్శించారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రభుత్వ స్కూల్కు చెందిన ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాలు బోధించకుండా నిద్రపోవడంపై నెటిజన్లు కూడా మండిపట్టారు. చివరకు ఈ విషయం విద్యాశాఖ అధికారులకు తెలిసింది. అయితే ఆ ప్రధానోపాధ్యాయుడిపై ఏదైనా అధికారిక విచారణ చేపట్టారా? క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.
राजस्थान टोडाभीम के राजकीय उच्च माध्यमिक विद्यालय का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है जिसमें स्कूल समय के दौरान प्रिंसिपल महोदय दरी बिछाकर सोते नजर आ रहे हैं। इस वायरल वीडियो ने यह बड़ा सवाल खड़ा कर दिया है कि जब स्कूल के मुखिया का ही ये हाल है, तो वहां पढ़ने वाले बच्चों का… pic.twitter.com/Ovi5UZVAaY
— Expose Now (@ExposeNowNews) October 1, 2026