ఇచ్చోడ, మే 26 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామంలో నాలుగేండ్ల కిందట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మాజీ సర్పంచ్ మీనాక్షి తమ వ్యవసా య క్షేత్రంలో 500 మామిడి మొక్కలు నాటారు. మొదటిసారి మామి డి చెట్లకు పండ్లు కాయడంతో మంగళవారం తొలి మామిడి కాయ బాక్స్‌ను బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటికి వెళ్లి ఇచ్చారు. కేటీఆర్ కొడుకు హిమాన్సు, కేటీఆర్ సతీమణి శైలిమకు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మీనాక్షి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.