‘సాగునీరు ఇవ్వకపోతే రైతుల తిరుగుబాటు తప్పదు’
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ఎడమ కాల్వకు వానాకాలం సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
– మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
మిర్యాలగూడ, ఆగస్టు 14 : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ఎడమ కాల్వకు వానాకాలం సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసి అన్ని డ్యాంలు నిండుగా ఉన్నాయని, శ్రీశైలం ప్రాజెక్టులో 872 అడుగుల నీరు ఉందని, మరో ఏడు అడుగులు అయితే ప్రాజెక్టు నిండుతుందని, ఈ దశలో అక్కడ విద్యుత్ తయారు చేసి సాగర్ ప్రాజెక్టుకు వదిలినట్లయితే ఆ నీటితో ఎడమ కాల్వకు రెండు పంటలకు నీటి విడుదల చేయవచ్చన్నారు. అదే విధంగా తాగునీటికి కూడా కొరత ఉండదని తెలిపారు. నీటి పారుదల శాఖ మంత్రి జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా కూడా నీటి విడుదలపై నోరు మెదపడం లేదని, అదే ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ర్రావు, భట్టి విక్రమార్కతోపాటు నల్లగొండ జిల్లా ఆయకట్టు పరిధిలో ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బీఎల్ఆర్, పద్మావతి ఉన్నారని, సాగునీటిపై వీరు ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎల్‌నినో ఏర్పడింది, నీటి కొరత ఉంటుందని అవగాహన లేకుండా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ తయారీని నిలిపి వేశారని, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించిన సందర్భంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నుండి విద్యుత్ తయారు చేసి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల చేశారని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ దశలోనే కేవలం విద్యుత్ తయారీ, నీటి నిల్వ కోసమే ఏర్పాటు చేశారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తున్నారని, ఈ విషయాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారని తెలిపారు. అక్రమ నీటి తరలింపుపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సోయి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నీటి విడుదల విషయంలో నిర్లక్ష్యం చేస్తే రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సాగునీటి విడుదలపై సలహాలు స్వీకరించి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నీటి విడుదల చేయనట్లయితే రైతులతో కలిసి ఛలో సాగర్ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ డ్డి, హాతీరాం, అన్నభీమోజు నాగార్జునచారి, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, పడిగపాటి కోటిరెడ్డి, ఎండి. యూసుఫ్, ఇలియాస్, పాచ్చునాయక్, వినోద్, రవీందర్, షోయబ్, పద్మావతి, రమాదేవి ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

