Malle poola Pallaki | మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కాగా, ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 16న హైదరాబాద్లోని శిల్పకళా వేదిక వేదికగా ‘ఇరుముడి’ ప్రీ రిలీజ్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగానే రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మల్లెపూల పల్లకి’ (Harihara Thanayudu Ekkinadu Pallaki – Mallepoola Pallaki) పాటను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.
‘Harihara Thanayudu Ekkinadu Pallaki’ 🔥🔥
The most awaited announcement is here 🔥❤️🔥#MallepoolaPallaki song launch & #Irumudi Pre-Release Event on August 16th at Shilpakalavedika, Hyderabad from 5 PM Onwards 🔥#IrumudiTrailer out now!
▶️ https://t.co/ovY0m5QeSvIn Cinemas… pic.twitter.com/qrXfBh2QH3
— Mythri Movie Makers (@MythriOfficial) August 14, 2026