Home
Telangana
Harvester Machine Catches Fire After Coming Into Contact With Electric Wires In Sangareddy District
Harvester machine | విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ యంత్రం దగ్ధం
విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ (వరికోసే మిషన్ )యంత్రం కాలి బూడిదైన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ముచ్చర్ల గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది.
హత్నూర,నవంబర్20 : విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ (వరికోసే మిషన్ )యంత్రం కాలి బూడిదైన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ముచ్చర్ల గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ శివారులో ఓ రైతు వ్యవసాయ పొలంలో హార్వెస్టర్ మిషన్ తో వరి కోస్తుండగా కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి మంటలు చేలరేగి మిషన్ పై పడ్డాయి.
దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినట్లు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనం నుండి కిందకు దిగి పరుగు తీయగా భారీగా చెలరేగిన మంటలకు హార్వెస్టర్ మిషన్ పూర్తిగా కాలి బూడిదయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harvester machine | విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ యంత్రం దగ్ధం
Aakasamlo Oka Tara | ‘ఆకాశంలో ఒక తార’ మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ ఎలా ఉందంటే!
మండల టాపర్ గా నిలిచిన విద్యార్థినికి నగదు పురస్కారం
Brutal murder | వెంపటి గ్రామంలో యువకుడి దారుణ హత్య
Mayookha | ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

